
దాదాపు ఎనిమిదేళ్ల కిత్రం శర్వానంద్, సాయికుమార్, సందీప్ కిషన్ ముఖ్య తారలుగా దేవ కట్టా దర్శకత్వంలో వచ్చిన ‘ప్రస్థానం’ సినిమాకు టాలీవుడ్‌లో మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు హిందీలో ‘ప్రస్థానం’ మొదలు కానుంది. అవును.. తెలుగు ‘ప్రస్థానం’ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. తెలుగు చిత్రాన్ని తెరకెక్కించిన దేవ కట్టానే హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహిస్తారట. శర్వానంద్ చేసిన పాత్రకు హీరో అలీ ఫజల్‌ను తీసుకున్నారు.
సాయికుమార్ ప్లేస్‌లో సంజయ్‌దత్ కనిపించనున్నారట. కథానాయికగా అమైరా దస్తూర్ కనిపిస్తారని బాలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే.. తెలుగులో ఈ చిత్రం నిడివి 2గంటల58 నిమిషాలు. కానీ హిందీ చిత్రం నిడివి తక్కువగా ఉంటుంది. జస్ట్ 2 గంటలే ఉంటుందట. సమకాలీన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment