దేవా కట్టా డైరెక్షన్లో అక్కినేని అఖిల్? | Deva Katta to direct Akkineni Akhil Debut Movie? | Sakshi
Sakshi News home page

దేవా కట్టా డైరెక్షన్లో అక్కినేని అఖిల్?

Published Mon, Nov 25 2013 12:06 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM

దేవా కట్టా డైరెక్షన్లో అక్కినేని అఖిల్?

దేవా కట్టా డైరెక్షన్లో అక్కినేని అఖిల్?

అఖిల్ అరంగ్రేటం సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని దేవా కట్టా దక్కించుకున్నారని ఫిలిమ్నగర్ వర్గాల సమచారం.

హైదరాబాద్: అక్కినేని వంశం నుంచి మరో వారసుడి తెరగ్రేటానికి రంగం సిద్ధమవుతోంది. 'కింగ్' నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ వెండి తెరకు పరిచయం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిల్ తొలి సినిమాకు దర్శకుడు ఎవరనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 'అత్తారింటికి దారేటి' సినిమాతో హిట్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్కు అఖిల్ఉ డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని ఇంతకుముందు ఊహాగానాలు వచ్చాయి. అయితే వీటిని అఖిల్ తోసిపుచ్చాడు.

తాజాగా దేవా కట్టా పేరు తెరపైకి వచ్చింది. అఖిల్ అరంగ్రేటం సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని ఆయన దక్కించుకున్నారని ఫిలిమ్నగర్ వర్గాల సమచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. వచ్చే ఏడాదిలో అఖిల్ సినిమా ఉంటుందని నాగార్జున ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అఖిల్ తొలి సినిమాకు దర్శకుడెవరో కొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశముంది. మరోవైపు నాగ చైతన్య హీరోగా దేవా కట్టా తెరకెక్కించిన 'ఆటోనగర్ సూర్య' సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement