మాట్లాడుతున్న హీరో అక్కినేని అఖిల్
తిరుపతి కల్చరల్: తన గత సినిమాల కంటే ఏజెంట్ చిత్రం కొత్తగా ఉంటుందని, తనను తాను నిరూపించుకునేందుకు ఏజెంట్ సినిమాలో వైల్డ్‌గా ప్రయత్నించానని యువ హీరో అక్కినేని అఖిల్ తెలిపారు. అక్కినేని అఖిల్, సాక్షి వైద్య హీరో హీరోయిన్‌న్లుగా, ముమ్మటి ప్రత్యేక పాత్రలో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నిర్మితమైన ఏజెంట్ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం శుక్రవారం రాత్రి తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సందడిచేసింది.
మీడియా సమావేశంలో అఖిల్ మాట్లాడుతూ ఈ చిత్రం ట్రైలర్‌కు విశేష స్పందన రావడం సంతోషకరమన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ సాక్షి వైద్యతో కెమిస్ట్రీ బాగా కుదిరిందని, అవసరం మేరకే సినిమాలో లవ్ స్టోరీ ఉంటుందన్నారు. అక్కినేని వారసుడిగా కాకుండా తనను తానుగా ప్రమోట్ చేసుకునేందుకే తాను ఇష్టపడతానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment