Auto Nagar surya
-
'ఆటో నగర్ సూర్య' మొత్తానికిలా వచ్చేస్తున్నాడు!
-
హ్యాట్రిక్ కోసం...
‘‘ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా సరే.. సందేహమే లేదు. పెద్ద హిట్ అవుతుంది’’ అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య పేర్కొన్నారు. ‘ఆటోనగర్ సూర్య’ చిత్రంపై చైతూ వెలిబుచ్చిన నమ్మకం ఇది. ఈ సినిమా విడుదలలో జాప్యం జరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. చివరికి ఈ నెల 27న విడుదల చేయనున్నారు. నాగచైతన్య, సమంత జంటగా ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై దేవా కట్టా దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారు చేసిన సందర్భంగా అచ్చిరెడ్డి మాట్లాడుతూ -‘‘ఏమాయ చేశావె, మనం సినిమాలతో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న నాగచైతన్య, సమంతలకు ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుంది. లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని దేవా కట్టా అద్భుతంగా మలిచారు. అత్యధిక థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. -
ఆటోనగర్ సూర్య రెడీ
‘‘ఈ సినిమా విడుదల చాలాసార్లు వాయిదా పడినా యూనిట్ సభ్యులు ఏమాత్రం నిరుత్సాహపడలేదు. సినిమా విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఆర్.ఆర్. మూవీ మేకర్స్‌కి ఉన్న గుడ్ విల్ ఈ సినిమాతో రెట్టింపు అవుతుంది’’ అన్నారు కె. అచ్చిరెడ్డి. దేవా కట్టా దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా ఆర్.ఆర్. మూవీ మేకర్స్ అధినేత వెంకట్ సమర్పణలో అచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఆటోనగర్ సూర్య’. ఈ నెల 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అచ్చిరెడ్డి మాట్లాడుతూ -‘‘మామూలుగా ఏ సినిమాకైనా ఆటంకాలు ఎదురైతే టెక్నీషియన్స్ డిస్ట్రబ్ అవుతారు. కానీ, దేవా కట్టా ఓ నమ్మకంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. వినూత్న కథాంశంతో రొటీన్‌కి భిన్నంగా ఈ సినిమాని తెరకెక్కించారు. మంచి మేధస్సు ఉన్న దర్శకుడు. ఈ చిత్రంతో నాగచైతన్య కమర్షియల్ హీరోగా ఇంకా ఎదుగుతాడు’’ అన్నారు. దేవా కట్టా మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రకథ వినగానే థ్రిల్ అవ్వడంతో పాటు, నా మీద నమ్మకంతో వెంకట్‌గారు నిర్మించారు. ఈ 27వ తేదీ మా టీమ్‌కి గ్రేట్ డే. సినిమా విజయంపట్ల మేమంతా ఆశావహ దృక్పథంతో ఉన్నాం. ఈ సినిమా బాగా రావడానికి మేం పడిన శ్రమకు ప్రేక్షకులు మంచి ఫలితాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు. -
న్యూ టాలెంట్‌ని ప్రోత్సాహిస్తున్న నాగ్
-
ఈ సినిమాలకు మోక్షం ఎప్పుడు?
-
దేవా కట్టా డైరెక్షన్లో అక్కినేని అఖిల్?
హైదరాబాద్: అక్కినేని వంశం నుంచి మరో వారసుడి తెరగ్రేటానికి రంగం సిద్ధమవుతోంది. 'కింగ్' నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ వెండి తెరకు పరిచయం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిల్ తొలి సినిమాకు దర్శకుడు ఎవరనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 'అత్తారింటికి దారేటి' సినిమాతో హిట్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అఖిల్ఉ డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని ఇంతకుముందు ఊహాగానాలు వచ్చాయి. అయితే వీటిని అఖిల్ తోసిపుచ్చాడు. తాజాగా దేవా కట్టా పేరు తెరపైకి వచ్చింది. అఖిల్ అరంగ్రేటం సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని ఆయన దక్కించుకున్నారని ఫిలిమ్‌నగర్ వర్గాల సమచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. వచ్చే ఏడాదిలో అఖిల్ సినిమా ఉంటుందని నాగార్జున ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అఖిల్ తొలి సినిమాకు దర్శకుడెవరో కొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశముంది. మరోవైపు నాగ చైతన్య హీరోగా దేవా కట్టా తెరకెక్కించిన 'ఆటోనగర్ సూర్య' సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
లవర్ బాయ్‌కి లక్ చిక్కేనా?
తండ్రి నుంచి కూడా పోటీని ఎదుర్కొక తప్పడం లేదు ఓ యువ హీరోకి. ఈ విషయాన్ని ఆ హీరోనే స్వయంగా తెలిపాడు కూడా. అయితే తమ మధ్య పోటీ ఉన్నా.. అది ఆరోగ్యకరమైనదిగానే ఉంటుందన్న యువ హీరో అక్కినేని నాగ చైతన్య నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. తాత, తండ్రి నుంచి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని జోష్ చిత్రంతో చైతు తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా నిరాశ కలిగించినా ఆ తర్వాత 'ఏ మాయ చేశావే', '100% లవ్' సినిమాల విజయంతో లవర్ బాయ్ ఈమేజ్ సొంతం చేసుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ పక్కకి తోసేసి మాస్ ఇమేజి సంపాదించుకునేందుకు నాగచైతన్య చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత వచ్చిన 'బెజవాడ', 'దడ' చిత్రాలే అతనికి నిరాశే మిగిల్చాయి. అనంతరం సునీల్‌తో కలిసి 'తడాఖా' చూపించాడు. తాజాగా దేవ కట్టా దర్శకత్వంలో వస్తున్న ‘ఆటోనగర్ సూర్య’పై నాగచైతన్య చాలా ఆశలే పెట్టుకున్నాడు. సుదీర్ఘ కాలంగా నడుస్తున్న ఈ సినిమా ఓ పాట మినహా పూర్తయింది. మరోవైపు అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటిస్తున్న (నాగేశ్వరావు ,నాగార్జున, నాగ చైతన్య) ‘మనం’ కొత్త షెడ్యూల్ డిసెంబర్ 1 నుంచి కర్నాటకలోని కూర్గ్‌లో మొదలవుతుంది. ఇక కొంతకాలంగా జోష్ తగ్గించిన నాగ చైతన్య సినిమాలు చేసే విషయంలో ప్రస్తుతం మంచి స్పీడ్ మీద ఉన్నాడు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం, డి.రామానాయుడు నిర్మించనున్న ‘సింగ్ వర్సెస్ కౌర్’ తెలుగు రీమేక్... మొదలు కావాల్సి ఉన్నాయి. పలు చిత్రాలతో తీరిక లేకుండా దూసుకుపోతున్న ఈ అక్కినేని కుర్రోడు ఆశించిన గుర్తింపు మాత్రం సాధించలేకపోతున్నాడు. 2009లో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ యంగ్ డైనమిక్కు సినీ పెద్దల సహకారం బాగానే ఉన్నప్పటికీ.. ఓ ప్రత్యేక గుర్తింపు కోసం నిరంతరం శ్రమిస్తున్నాడు. తాత, తండ్రిల స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్న ఈ నటుడు అందుకు తగ్గ ప్రయత్నాలనే చేస్తున్నాడు. ఈ ఏడాది అయినా అతని ప్రయత్నాలు సఫలం కావాలని ఆశిద్దాం. -
23న ఆటోనగర్ సూర్య ఫస్ట్‌లుక్