లవర్ బాయ్కి లక్ చిక్కేనా? | Birthday wishes to Naga Chaitanya | Sakshi
Sakshi News home page

లవర్ బాయ్కి లక్ చిక్కేనా?

Nov 23 2013 1:17 PM | Updated on Sep 2 2017 12:54 AM

లవర్ బాయ్కి లక్ చిక్కేనా?

లవర్ బాయ్కి లక్ చిక్కేనా?

తాత, తండ్రి నుంచి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.

తండ్రి నుంచి కూడా పోటీని ఎదుర్కొక తప్పడం లేదు ఓ యువ హీరోకి. ఈ విషయాన్ని ఆ హీరోనే స్వయంగా తెలిపాడు కూడా.  అయితే  తమ మధ్య పోటీ ఉన్నా..  అది ఆరోగ్యకరమైనదిగానే ఉంటుందన్న  యువ హీరో అక్కినేని నాగ చైతన్య నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. తాత, తండ్రి నుంచి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని జోష్ చిత్రంతో చైతు తొలిసారి  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా నిరాశ కలిగించినా ఆ తర్వాత 'ఏ మాయ చేశావే', '100% లవ్' సినిమాల విజయంతో లవర్ బాయ్ ఈమేజ్ సొంతం చేసుకున్నాడు.

లవర్ బాయ్ ఇమేజ్ పక్కకి తోసేసి మాస్ ఇమేజి సంపాదించుకునేందుకు  నాగచైతన్య చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత వచ్చిన  'బెజవాడ', 'దడ' చిత్రాలే అతనికి నిరాశే మిగిల్చాయి. అనంతరం సునీల్తో కలిసి 'తడాఖా' చూపించాడు. తాజాగా దేవ కట్టా దర్శకత్వంలో వస్తున్న ‘ఆటోనగర్ సూర్య’పై నాగచైతన్య చాలా ఆశలే పెట్టుకున్నాడు. సుదీర్ఘ కాలంగా నడుస్తున్న ఈ సినిమా ఓ పాట మినహా పూర్తయింది. మరోవైపు  అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటిస్తున్న (నాగేశ్వరావు ,నాగార్జున, నాగ చైతన్య)  ‘మనం’ కొత్త షెడ్యూల్ డిసెంబర్ 1 నుంచి కర్నాటకలోని కూర్గ్‌లో మొదలవుతుంది.

ఇక కొంతకాలంగా జోష్ తగ్గించిన నాగ చైతన్య సినిమాలు చేసే విషయంలో ప్రస్తుతం మంచి స్పీడ్ మీద ఉన్నాడు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం, డి.రామానాయుడు నిర్మించనున్న ‘సింగ్ వర్సెస్ కౌర్’ తెలుగు రీమేక్... మొదలు కావాల్సి ఉన్నాయి. పలు చిత్రాలతో తీరిక లేకుండా దూసుకుపోతున్న ఈ అక్కినేని కుర్రోడు ఆశించిన గుర్తింపు మాత్రం సాధించలేకపోతున్నాడు. 2009లో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ యంగ్ డైనమిక్‌కు సినీ పెద్దల సహకారం బాగానే ఉన్నప్పటికీ.. ఓ ప్రత్యేక గుర్తింపు కోసం నిరంతరం శ్రమిస్తున్నాడు. తాత, తండ్రిల స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్న ఈ నటుడు అందుకు తగ్గ ప్రయత్నాలనే చేస్తున్నాడు. ఈ ఏడాది అయినా అతని ప్రయత్నాలు సఫలం కావాలని ఆశిద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement