హ్యాట్రిక్ కోసం... | 'Auto Nagar Surya' release date confirmed | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్ కోసం...

Published Sat, Jun 14 2014 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

హ్యాట్రిక్  కోసం...

హ్యాట్రిక్ కోసం...

 ‘‘ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా సరే.. సందేహమే లేదు. పెద్ద హిట్ అవుతుంది’’ అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య పేర్కొన్నారు. ‘ఆటోనగర్ సూర్య’ చిత్రంపై చైతూ వెలిబుచ్చిన నమ్మకం ఇది. ఈ సినిమా విడుదలలో జాప్యం జరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. చివరికి ఈ నెల 27న విడుదల చేయనున్నారు. నాగచైతన్య, సమంత జంటగా ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై దేవా కట్టా దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి నిర్మించిన విషయం తెలిసిందే.

ఈ చిత్రం విడుదల తేదీ ఖరారు చేసిన సందర్భంగా అచ్చిరెడ్డి మాట్లాడుతూ -‘‘ఏమాయ చేశావె, మనం సినిమాలతో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న నాగచైతన్య, సమంతలకు ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుంది. లవ్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని దేవా కట్టా అద్భుతంగా మలిచారు. అత్యధిక థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement