
నాగచైతన్య–సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యల్ని సినీ ప్రముఖులు ముక్తకంఠంతో ఖండించారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పడంతోపాటు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. కాగా కొండా సురేఖపై నాగార్జున పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అఖిల్ మరోసారి స్పందించి, సోషల్ మీడియాలో ఘాటుగాపోస్టు పెట్టారు.
దాని సారాంశం ఏంటంటే... ‘‘కొండా సురేఖ చేసిన నిరాధారమైన వ్యాఖ్యలు అసభ్యకరంగా, జుగు΄్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె తన నైతికత, సామాజిక సంక్షేమాన్ని మరచిపోయి ప్రవర్తించిన తీరు సిగ్గు చేటు, క్షమించరానిది. ఆమె మాటలతో మా కుటుంబ సభ్యులతోపాటు ప్రజలు కూడా బాధపడ్డారు.
స్వార్థపూరితంగా గెలవడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ యుద్ధంలో.. తన కంటే చాలా ఉన్నత విలువలు, సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై సిగ్గు లేకుండా దాడి చేసి బలిపశువులను చేశారామె. కుటుంబ సభ్యుడిగా, చిత్ర పరిశ్రమ సభ్యుడిగా మౌనంగా చూస్తూ ఉండలేను. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని శిక్షించాలి. మన సమాజంలో ఆమెలాంటి వాళ్లకు చోటు, గౌరవం లేదు. ఆమెను సహించేది లేదు... క్షమించేది లేదు’’ అని పేర్కొన్నారు అఖిల్.
Comments
Please login to add a commentAdd a comment