
హాంకాంగ్ : దేశంలోని ప్రముఖ ఎవలంజికల్ చర్చిను చైనా ప్రభుత్వం డైనమైట్ బాంబుతో నేలకూల్చింది. దీంతో పలు క్రిస్టియన్ సంఘాలు చైనా ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. మత స్వేచ్ఛ, మానవ హక్కులపై చైనా ప్రభుత్వానికి ఏ మాత్రం గౌరవం లేదని అన్నాయి.
షాంగ్జీ ప్రావిన్సులో గల ది గోల్డెన్ ల్యాంప్‌స్టాండ్ చర్చి అత్యంత పురాతనమైనది. అధ్యాత్మిక జీవనాన్ని నియంత్రించేందుకు చైనా కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే కొద్దిరోజులుగా చర్చిలను నేలకూల్చుతోంది. అయితే, చర్చిల వరుస కూల్చివేతల వెనుక చైనా ప్రభుత్వ భయాందోళనలు ఉన్నట్లు తెలుస్తోంది.
పాశ్చాత్య దేశాల సంస్కృతికి చెందిన క్రైస్తవ మత వ్యాప్తి దేశంలో జరిగితే భవిష్యత్‌లో కమ్యూనిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈ కారణాన్ని పైకి చూపకుండా అధ్యాత్మికతపై నియంత్రణ పేరుతో క్రైస్తవ మతాన్ని కూకటివేళ్లతో పెకలించేందుకు చైనా ప్రభుత్వం యత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment