ఓరుగల్లులో ‘డైనమైట్’ | manchu vishnu at warangal | Sakshi
Sakshi News home page

ఓరుగల్లులో ‘డైనమైట్’

Published Sun, Aug 30 2015 4:32 AM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM

ఓరుగల్లులో ‘డైనమైట్’

ఓరుగల్లులో ‘డైనమైట్’

థియేటర్‌లో విష్ణు, ప్రణీతల సందడి
‘చారిత్రాత్మక ఓరుగల్లుకు రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ప్రసిద్ధి గాంచిన వేయిస్తంబాల దేవాలయాన్ని చూడాలని ఎంతో ఆశగా ఉండేది. ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇన్నాళ్లకు కోరిక తీరింది’ అని హీరో మంచు విష్ణువర్దన్ అన్నారు. సెప్టెంబర్ 4వ తేదీన విడుదల కానున్న ‘డైనమైట్’ సినిమా సందర్భంగా శనివారం హన్మకొండలోని శ్రీదేవి ఏషియన్‌మాల్‌కు హీరోయిన్ ప్రణీత, సినీ రచయిత బీవీఎస్ రవితో కలిసి వచ్చారు. విష్ణువర్దన్ వెంట మోహన్‌బాబు సన్నిహితుడు గజేంద్రనాయుడు ఉన్నారు. అనంతరం చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్థంభాల దేవాలయాన్ని సందర్శించారు. శ్రీరుద్రేశ్వరుని సన్నిధిలో లఘసహస్రనామార్చనలు నిర్వహించారు. ఆలయనాట్యమండపంలో మంచు విష్ణుకు తీర్ధప్రసాదాలు శేషవస్త్రాలు మహాదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయశిల్పకళ విశేషాలను గంగు ఉపేంద్రశర్మ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement