
డేరింగ్... డాషింగ్... డైనమైట్
‘‘మోహన్‌బాబు కుటుంబం అంటే నా కుటుంబమే. తండ్రి మోహన్‌బాబు అడుగుజాడల్లో నడుస్తూ, మనిషిలో ఉండేది గెలుపోటములు కాదు.. వ్యక్తిత్వం అనే సిద్ధాంతంతో ముందుకెళుతున్నాడు విష్ణు. తనతో ‘ఎర్రబస్సు’ చేశాను. నా ఆరోగ్యం కుదుటపడ్డాక విష్ణుతో మరో చిత్రం చేయాలనుకుంటున్నా’’ అని దర్శకర త్న దాసరి నారాయణరావు అన్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం‘ డైనమైట్’. దేవా కట్టా దర్శకుడు. అచ్చు స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
దాసరి నారాయణరావు ఆడియో సీడీని ఆవిష్కరించి, మోహన్‌బాబు సతీమణి నిర్మలకు అందించారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ- ‘‘నేను 35 ఏళ్ల క్రితం ై‘డెనమైట్’ పేరుతో సినిమా తీయాలనుకున్నాను. కానీ కుదర్లేదు. ఇప్పుడు అదే పేరుతో విష్ణు సినిమా తీసినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘ఈ సినిమా కోసం విష్ణు ప్రతి ఫ్రేములోనూ కష్టపడ్డాడు. అతని కష్టం రేపు తెరపై కనిపిస్తుంది. దేవా కట్టా ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు’’ అని మోహన్‌బాబు అన్నారు. మంచు మనోజ్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయి. విజయన్ ఫైట్స్‌ను చాలా కొత్తగా డిజైన్ చేశారు. ఈ పాత్ర చాలా డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఉంటుంది’’ అని చెప్పారు.