
హెవీ యాక్షన్‌తో...
‘‘హెవీ యాక్షన్ ప్యాక్‌డ్ ఎంటర్‌టైనర్ ‘డైనమైట్’. సౌండ్ మిక్సింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ సినిమా తుది దశలో ఉంది. జూలై 3న సినిమా విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి. వాటిలో ఏ మాత్రం నిజం లేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
జూలై 17 లేదా 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని మంచు విష్ణు తెలిపారు. దేవ కట్టా దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘డైనమైట్’. ఇందులో ప్రణీత కథానాయిక.
దర్శకుడు దేవా కట్టా మాట్లాడుతూ -‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్. అన్ని సన్నివే శాలు బాగా వచ్చాయి’’ అని చెప్పారు. విష్ణు డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఈ చిత్రానికి హైలైట్ అని రచయిత బీవీయస్ రవి అన్నారు.