హలో మిస్టర్... ఇదిగో ధోతీ | new dress fashion | Sakshi
Sakshi News home page

హలో మిస్టర్... ఇదిగో ధోతీ

Published Thu, Aug 20 2015 11:45 PM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM

హలో మిస్టర్... ఇదిగో ధోతీ

హలో మిస్టర్... ఇదిగో ధోతీ

హలో మిస్టర్ చూశారా ఈ విడ్డూరం!! మీరు ధోతి మానేసి పెన్సిల్‌కట్, వెయిస్ట్‌కట్, కట్,.. కట్... అంటూ జీన్ ప్యాంట్స్ వేసుకోవడం మొదలుపెట్టారు. అంతటితో ఆగారా..! మన ధోతి గొప్పతనమే మర్చిపోయారు. లలనామణులు అలా కాదు. మీకు ధోతిని గుర్తుచేయడమే కాకుండా.. దానిని చీరతో జతచేసి ఓ డిఫరెంట్ స్టైల్‌తో వెలిగిపోతున్నారు చూడండి. మరి, ఆడాళ్లా మజాకా..!
 
 మూలం ఇదీ...
 గుజరాతీ మహిళల చీరకట్టును చూశారా! ఆ కట్టును పోలినట్టుగా ఉండే ఈ స్టైల్‌కి కొంచెం వెస్టర్న్ కట్స్‌ను జోడించారు డిజైనర్లు. రాచరికమైన ఆకర్షణ ఈ కట్టులో ఉండటంతో వేడుకలలో మెరిసిపోవడం మొదలైంది. సందర్భానికి తగ్గ వేడుకకు డిజైనర్ కొత్త టచ్ ఇవ్వడంతో మరింతగా మెరిసిపోతోంది.
 
 సోనమ్ కపూర్..
 ధోతి కట్టు శారీ అనగానే సోనమ్ కపూర్ కళ్లముందు దర్శనమిస్తుంది. అంతగా ఈ కట్టుకు ఆమె ప్రాచుర్యం తీసుకువచ్చింది. డిజైనర్లు అనామికా ఖన్నా, తరుణ్ తహిల్యాని, నిఖిల్ తంబి, గారంగ్.. వంటి ప్రముఖ డిజైనర్లు ధోతీకట్టులో ఎన్నో ఆకర్షణీయమైన మార్పులు తీసుకువచ్చారు.
 
 గ్లామర్...
 నాటి రోజుల్లో నారీమణులు ధరించిన నారచీరల కట్టు ఎలా ఉండేదో మనకు సుపరిచితమే. దానినే పోలినట్టుగా ఉండే ఈ ధోతీ స్టైల్ అతివల మనసును అమాంతం లాగేసుకుంది. సంప్రదాయ చీరకట్టుకు కాస్త గ్లామర్ టచ్ ఇవ్వడానికి టాలెంట్ గల డిజైనర్లు మగవారి ధోతి కట్టును, చీరకు జత కలిపారు. దీంట్లో ఎన్నో సృజనాత్మకమైన స్టైల్స్‌ను తీసుకువచ్చారు. ఆరు గజాల చీరను మూడు గజాలకు తగ్గించి, పెట్టీకోట్‌గా లెగ్గింగ్, ధోతీ ప్యాంట్స్/ఎలిఫెంట్ ప్యాంట్స్/ ఫ్లేర్డ్ ప్యాంట్స్/.. మీదకు కొంగులా ధరిస్తే చాలు ఈ చక్కని రూపం మీ సొంతం.
 
ధోతీ శారీ టిప్స్...
పండగల్లోనూ విశేషంగా నిలుస్తోన్న ఈ స్టైల్‌నిమీరూ ఇంట్లోనే ఫాలో అయిపోవచ్చు.రెడీ మేడ్ ధోతినీ ధరించి, నడుముభాగాన  ఒకవైపు 3-4 చీరకుచ్చులను టక్ చేయాలి. కుచ్చులు మరీ పెద్దగా, అలాగని చిన్నవిగా కాకుండా కనీసం 4 ఇంచులు ఉండాలి.ఎడమవైపు కొంగు భాగాన్ని నడుము చుట్టూ తిప్పి, ఎడమ భుజం మీదకు తీసుకొచ్చి పిన్ చేయాలి.కుచ్చిళ్లు ముందు, వెనక, భుజం మీదుగా సరిగ్గా వచ్చాయో లేవో చెక్ చేసుకుంటే సరిపోతుంది.
 - ఎన్.ఆర్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement