‘మిక్స్ అండ్ మ్యాచ్’
ఆసం
ఆధునికాన్ని సంప్రదాయంతో కలిపితే?
‘మిక్స్ అండ్ మ్యాచ్’ అవుతుంది.
జీన్ ప్యాంట్ మీద కుర్తా... లెహంగా మీద షర్ట్...
ఇలా మిక్స్ చేసి, మ్యాచ్ చేసుకుంటే ఏమవుతారు?
మిక్సమ్మలు అవుతారు.
సంభ్రమం కలిగించే ఆసం మిక్సమ్మలు అవుతారు.
►లాంగ్ స్లీవ్స్ జార్జెట్ అనార్కలీ టాప్‌కి బాటమ్‌గా జీన్స్, కాళ్లకు బూట్లు... లుక్‌ని పూర్తిగా మార్చేసే స్టైల్ వనితల అందానికి కొత్త భాష్యం చెబుతోంది.
► ప్లెయిన్ లెహంగా మీదకు వెస్ట్రన్ క్రాప్ టాప్, వెడల్పాటి బెల్ట్ - ఇది టీనేజర్స్ స్టైల్స్‌కి కొత్త మెరుగులు దిద్దుతోంది.
► సంప్రదాయ చందేరీ లెహంగా మీదకు ఎంబ్రాయిడరీ చేసిన వెస్ట్రన్ ఓవర్ కోట్... స్టైల్‌లో ముందు వర సలో నిలుస్తోంది.
► లాంగ్ స్లీవ్స్ గౌన్‌కు బాటమ్‌గా జీన్స్ ధరిస్తే... ఏ వేదికపైన అయినా హైలైట్‌గా నిలవాల్సిందే!
► ఎంబ్రాయిడరీ చేసిన ఫ్రంట్ ఓపెన్ నెటెడ్ లాంగ్ కుర్తాకు టామ్ జీన్స్, స్లీవ్‌లెస్ క్రాప్‌టాప్ ధరిస్తే ఇండో వెస్ట్రన్ స్టైల్‌కి సిసలైన కళను తీసుకువస్తుంది.
► ఫ్లోర్ లెంగ్త్ ఫ్రంట్ ఓపెన్ అనార్కలీ ఫ్రాక్‌కి బాటమ్‌గా జెగ్గింగ్, లేదంటే జీన్స్ ధరిస్తే వచ్చే లుక్ ఎంతో స్టైలిష్‌గా ఉంటుంది.
► పటియాలా సల్వార్.. దాని మీద వెస్ట్రన్ లాంగ్ ఓవర్ కోట్ ధరిస్తే... చూపులను కట్టిపడేయాల్సిందే!
► పొడవాటి సంప్రదాయ కుర్తీకి బాటమ్‌గా డెనిమ్ ప్యాంట్ ఆధునికతకు అద్దం పడుతోంది. క్యాజువల్, స్టైలిష్ వేర్‌గా ఈ గెటప్ నేటి యువతులను బాగా ఆకట్టుకుంటోంది.
మిక్స్ అండ్ మ్యాచ్‌కి కొన్ని టిప్స్
►ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులను మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ధరించినప్పుడు..
►{స్టెయిట్ కట్, స్లీక్ పొనీ టెయిల్, ఒక వైపు మాత్రమే వేసుకునే ఫిష్ టెయిల్ వంటి హెయిర్ స్టైల్స్ బాగా నప్పుతాయి.
►ఈ డ్రెస్సుల మీదకు ఏ ఆభరణాలూ అవసరం లేదు. ధరించాలనుకుంటే సంప్రదాయ ఆభరణాల కన్నా ఫ్యాన్సీ జ్యుయలరీయే ఆకర్షణీయంగా ఉంటుంది.
►ఈ తరహా స్టైల్‌లో మెరిసినప్పుడు క్లచ్, హ్యాండ్ పర్స్‌ల వంటివి చేతిలో ధరిస్తే లుక్ బాగుంటుంది.