jean pants
-
‘మిక్స్ అండ్ మ్యాచ్’
ఆసం ఆధునికాన్ని సంప్రదాయంతో కలిపితే? ‘మిక్స్ అండ్ మ్యాచ్’ అవుతుంది. జీన్ ప్యాంట్ మీద కుర్తా... లెహంగా మీద షర్ట్... ఇలా మిక్స్ చేసి, మ్యాచ్ చేసుకుంటే ఏమవుతారు? మిక్సమ్మలు అవుతారు. సంభ్రమం కలిగించే ఆసం మిక్సమ్మలు అవుతారు. ►లాంగ్ స్లీవ్స్ జార్జెట్ అనార్కలీ టాప్‌కి బాటమ్‌గా జీన్స్, కాళ్లకు బూట్లు... లుక్‌ని పూర్తిగా మార్చేసే స్టైల్ వనితల అందానికి కొత్త భాష్యం చెబుతోంది. ► ప్లెయిన్ లెహంగా మీదకు వెస్ట్రన్ క్రాప్ టాప్, వెడల్పాటి బెల్ట్ - ఇది టీనేజర్స్ స్టైల్స్‌కి కొత్త మెరుగులు దిద్దుతోంది. ► సంప్రదాయ చందేరీ లెహంగా మీదకు ఎంబ్రాయిడరీ చేసిన వెస్ట్రన్ ఓవర్ కోట్... స్టైల్లో ముందు వర సలో నిలుస్తోంది. ► లాంగ్ స్లీవ్స్ గౌన్‌కు బాటమ్‌గా జీన్స్ ధరిస్తే... ఏ వేదికపైన అయినా హైలైట్‌గా నిలవాల్సిందే! ► ఎంబ్రాయిడరీ చేసిన ఫ్రంట్ ఓపెన్ నెటెడ్ లాంగ్ కుర్తాకు టామ్ జీన్స్, స్లీవ్‌లెస్ క్రాప్‌టాప్ ధరిస్తే ఇండో వెస్ట్రన్ స్టైల్‌కి సిసలైన కళను తీసుకువస్తుంది. ► ఫ్లోర్ లెంగ్త్ ఫ్రంట్ ఓపెన్ అనార్కలీ ఫ్రాక్‌కి బాటమ్‌గా జెగ్గింగ్, లేదంటే జీన్స్ ధరిస్తే వచ్చే లుక్ ఎంతో స్టైలిష్‌గా ఉంటుంది. ► పటియాలా సల్వార్.. దాని మీద వెస్ట్రన్ లాంగ్ ఓవర్ కోట్ ధరిస్తే... చూపులను కట్టిపడేయాల్సిందే! ► పొడవాటి సంప్రదాయ కుర్తీకి బాటమ్‌గా డెనిమ్ ప్యాంట్ ఆధునికతకు అద్దం పడుతోంది. క్యాజువల్, స్టైలిష్ వేర్‌గా ఈ గెటప్ నేటి యువతులను బాగా ఆకట్టుకుంటోంది. మిక్స్ అండ్ మ్యాచ్‌కి కొన్ని టిప్స్ ►ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులను మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ధరించినప్పుడు.. ►{స్టెయిట్ కట్, స్లీక్ పొనీ టెయిల్, ఒక వైపు మాత్రమే వేసుకునే ఫిష్ టెయిల్ వంటి హెయిర్ స్టైల్స్ బాగా నప్పుతాయి. ►ఈ డ్రెస్సుల మీదకు ఏ ఆభరణాలూ అవసరం లేదు. ధరించాలనుకుంటే సంప్రదాయ ఆభరణాల కన్నా ఫ్యాన్సీ జ్యుయలరీయే ఆకర్షణీయంగా ఉంటుంది. ►ఈ తరహా స్టైల్లో మెరిసినప్పుడు క్లచ్, హ్యాండ్ పర్స్‌ల వంటివి చేతిలో ధరిస్తే లుక్ బాగుంటుంది. -
హలో మిస్టర్... ఇదిగో ధోతీ
హలో మిస్టర్ చూశారా ఈ విడ్డూరం!! మీరు ధోతి మానేసి పెన్సిల్‌కట్, వెయిస్ట్కట్, కట్,.. కట్... అంటూ జీన్ ప్యాంట్స్ వేసుకోవడం మొదలుపెట్టారు. అంతటితో ఆగారా..! మన ధోతి గొప్పతనమే మర్చిపోయారు. లలనామణులు అలా కాదు. మీకు ధోతిని గుర్తుచేయడమే కాకుండా.. దానిని చీరతో జతచేసి ఓ డిఫరెంట్ స్టైల్‌తో వెలిగిపోతున్నారు చూడండి. మరి, ఆడాళ్లా మజాకా..! మూలం ఇదీ... గుజరాతీ మహిళల చీరకట్టును చూశారా! ఆ కట్టును పోలినట్టుగా ఉండే ఈ స్టైల్‌కి కొంచెం వెస్టర్న్ కట్స్‌ను జోడించారు డిజైనర్లు. రాచరికమైన ఆకర్షణ ఈ కట్టులో ఉండటంతో వేడుకలలో మెరిసిపోవడం మొదలైంది. సందర్భానికి తగ్గ వేడుకకు డిజైనర్ కొత్త టచ్ ఇవ్వడంతో మరింతగా మెరిసిపోతోంది. సోనమ్ కపూర్.. ధోతి కట్టు శారీ అనగానే సోనమ్ కపూర్ కళ్లముందు దర్శనమిస్తుంది. అంతగా ఈ కట్టుకు ఆమె ప్రాచుర్యం తీసుకువచ్చింది. డిజైనర్లు అనామికా ఖన్నా, తరుణ్ తహిల్యాని, నిఖిల్ తంబి, గారంగ్.. వంటి ప్రముఖ డిజైనర్లు ధోతీకట్టులో ఎన్నో ఆకర్షణీయమైన మార్పులు తీసుకువచ్చారు. గ్లామర్... నాటి రోజుల్లో నారీమణులు ధరించిన నారచీరల కట్టు ఎలా ఉండేదో మనకు సుపరిచితమే. దానినే పోలినట్టుగా ఉండే ఈ ధోతీ స్టైల్ అతివల మనసును అమాంతం లాగేసుకుంది. సంప్రదాయ చీరకట్టుకు కాస్త గ్లామర్ టచ్ ఇవ్వడానికి టాలెంట్ గల డిజైనర్లు మగవారి ధోతి కట్టును, చీరకు జత కలిపారు. దీంట్లో ఎన్నో సృజనాత్మకమైన స్టైల్స్‌ను తీసుకువచ్చారు. ఆరు గజాల చీరను మూడు గజాలకు తగ్గించి, పెట్టీకోట్గా లెగ్గింగ్, ధోతీ ప్యాంట్స్/ఎలిఫెంట్ ప్యాంట్స్/ ఫ్లేర్డ్ ప్యాంట్స్/.. మీదకు కొంగులా ధరిస్తే చాలు ఈ చక్కని రూపం మీ సొంతం. ధోతీ శారీ టిప్స్... పండగల్లోనూ విశేషంగా నిలుస్తోన్న ఈ స్టైల్నిమీరూ ఇంట్లోనే ఫాలో అయిపోవచ్చు.రెడీ మేడ్ ధోతినీ ధరించి, నడుముభాగాన ఒకవైపు 3-4 చీరకుచ్చులను టక్ చేయాలి. కుచ్చులు మరీ పెద్దగా, అలాగని చిన్నవిగా కాకుండా కనీసం 4 ఇంచులు ఉండాలి.ఎడమవైపు కొంగు భాగాన్ని నడుము చుట్టూ తిప్పి, ఎడమ భుజం మీదకు తీసుకొచ్చి పిన్ చేయాలి.కుచ్చిళ్లు ముందు, వెనక, భుజం మీదుగా సరిగ్గా వచ్చాయో లేవో చెక్ చేసుకుంటే సరిపోతుంది. - ఎన్.ఆర్ -
నీ జీనూ ప్యాంటూ చూసి...
చిత్రంలో అమ్మాయి ఓ మోడల్. పేరు లియా జంగ్.. ఈ మధ్య ఆమె న్యూయార్క్‌లోని ప్రధాన వీధుల్లో ఎంచక్కా తిరిగింది. ఇందులో ఏముంది అంటున్నారా.. ఉందండి.. ఈమె న్యూయార్క్ వీధుల్లో అర్ధనగ్నంగా తిరిగింది!! బుర్ర గోక్కుంటున్నారా? నిజం.. ఆమె అసలు ప్యాంట్ వేసుకోనేలేదు. మనకు కనిపిస్తున్న జీన్ ప్యాంట్ కేవలం పెయింటింగ్!! బాడీ ఆర్ట్ అన్నమాట. న్యూయార్క్ ప్రజల పరిశీలనా శక్తిని గమనించడం కోసం ‘మోడల్ ప్రాంక్‌స్టర్స్’ టీవీవారు ఈ ప్రయోగాన్ని చేశారు. జీన్ ప్యాంట్ రంగు బాడీ ఆర్ట్‌తో లియా నగర ప్రధాన వీధులతోపాటు లోకల్ ట్రైన్‌లోనూ తిరిగినా.. ఎవరికీ డౌట్ రాలేదట. పైగా.. ఓ బట్టలు షాపునకు వెళ్లి.. బాబూ.. ఈ రంగు జీన్.. ఇదే మోడల్‌ది కావాలి అని లియా అడిగితే.. షాపోడు కూడా ఓసారి ‘జీన్’ను తేరిపారా చూసి.. కింద ఫ్లోర్లో ఉంది మేడం అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. తొలిరోజే దీన్ని 10 లక్షల మంది వీక్షించారు. -
మందంగా... అందంగా!
‘అమ్మా! ఈ జీన్స్ ప్యాంటు ఇక వేసుకోను, ఒక్కసారికని తమ్ముడికిస్తే వాడు ప్యాంటు అంచులు చించేశాడు’ అనే కంప్లయింట్ కూతురి నుంచి. ‘అక్క ప్యాంటు పొడవుగా ఉంది, ఆడుకునేటప్పుడు అంచులు నేలకు తాకి నలిగిపోయింది నేనేం చేయను’ తన పొరపాటేమీ లేదన్నంత అమాయకంగా వస్తుంది కొడుకు నుంచి జవాబు. ‘సరే! ఇక చేసేదేముంది... ఆ ప్యాంటు అంచులు కత్తిరించి మడిచి కుట్టిస్తే సరి, ఈసారి పండక్కి తమ్ముడికి ప్యాంటు కొనక్కర్లేదు’ ఈ సమాధానంతో కూతురి ముఖం వెలిగిపోతుంది, కొడుకు ముఖం ఉక్రోషంతో ఎర్రబడుతుంది. కొంచెం అటూ యిటూగా ప్రతి ఇంట్లో ఇలాంటి సీన్లు ఉండనే ఉంటాయి. పుట్టినరోజులు, పండుగలు ఇలా పిల్లలకు ఏడాదికి కనీసం నాలుగు నుంచి ఆరు జతలు తప్పనిసరిగా కొనక తప్పదు. వార్డ్రోబ్ నిండా లెక్కలేనన్ని డెనిమ్ క్లాత్ ప్యాంట్లు, షర్టులు చేరుతుంటాయి. పిల్లలు పైకి చెప్పరు కానీ లోలోపల ‘వీటిని వదిలించుకోవడం ఎలా’ అనుకుంటుంటారు. ‘జీన్స్ ప్యాంట్లు అన్ని షేడ్లలోనూ ఉన్నాయి. ఈ సారి బర్త్‌డేకి ఏ షేడ్ కొనుక్కోవాలి’ అనేది వాళ్లకో మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి సమాధానంగా ఒక్కో ప్యాంటుని తీసి కత్తిరించి ముక్కలు చేయండి... ఆ ముక్కలను కలిపి ఇక్కడ ఫొటోల్లో ఉన్నట్లు కుట్టండి. దానికి అంచుగా మెత్తటి క్లాత్‌తో బోర్డర్ కుట్టండి. దట్టమైన క్విల్ట్ (బొంత) రెడీ అవుతుంది. పైగా వచ్చేది చలికాలం కూడ. చక్కగా ఉపయోగపడుతుంది. డెనిమ్ క్లాత్ మందంగా ఉంటుంది కాబట్టి వలయాకారపు డిజైన్ల జోలికి పోవద్దు. డెనిమ్ క్లాత్‌ని నలుచదరంగా కానీ దీర్ఘచతురస్రంగా కానీ కత్తిరించుకుంటే కుట్టడం సులువు. క్విల్ట్ ఆకర్షణీయంగా ఉండాలంటే రంగురంగుల క్లాత్‌ని పువ్వుల్లా కత్తిరించి ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు.