నీ జీనూ ప్యాంటూ చూసి...
చిత్రంలో అమ్మాయి ఓ మోడల్. పేరు లియా జంగ్.. ఈ మధ్య ఆమె న్యూయార్క్‌లోని ప్రధాన వీధుల్లో ఎంచక్కా తిరిగింది. ఇందులో ఏముంది అంటున్నారా.. ఉందండి.. ఈమె న్యూయార్క్ వీధుల్లో అర్ధనగ్నంగా తిరిగింది!! బుర్ర గోక్కుంటున్నారా? నిజం.. ఆమె అసలు ప్యాంట్ వేసుకోనేలేదు. మనకు కనిపిస్తున్న జీన్ ప్యాంట్ కేవలం పెయింటింగ్!! బాడీ ఆర్ట్ అన్నమాట. న్యూయార్క్ ప్రజల పరిశీలనా శక్తిని గమనించడం కోసం ‘మోడల్ ప్రాంక్‌స్టర్స్’ టీవీవారు ఈ ప్రయోగాన్ని చేశారు.
జీన్ ప్యాంట్ రంగు బాడీ ఆర్ట్‌తో లియా నగర ప్రధాన వీధులతోపాటు లోకల్ ట్రైన్‌లోనూ తిరిగినా.. ఎవరికీ డౌట్ రాలేదట. పైగా.. ఓ బట్టలు షాపునకు వెళ్లి.. బాబూ.. ఈ రంగు జీన్.. ఇదే మోడల్‌ది కావాలి అని లియా అడిగితే.. షాపోడు కూడా ఓసారి ‘జీన్’ను తేరిపారా చూసి.. కింద ఫ్లోర్‌లో ఉంది మేడం అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. తొలిరోజే దీన్ని 10 లక్షల మంది వీక్షించారు.