ప్రపంచంలో ఎప్పటికప్పుడు అనేక కొత్త సాంకేతిక ఆవిష్కరణలు సృష్టిలోకి వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని చాలా ఉపయోగకరమైనవి, వేగంగా ప్రాచుర్యం పొందుతుంటాయి. మరికొన్ని మరింత ప్రయోగాత్మకంగా ఉంటాయి. అయితే కొన్ని ఆవిష్కరణలు మాత్రం విచిత్రంగా అనిపిస్తాయి. వాటిని మనం ఎప్పటికీ ఊహించలేము. అయినా వాటితో సమాజానికి ఉపయోగం ఉంటుంది. ఇలా ఈ ఏడాది వచ్చిన కొన్ని విచిత్రమైన సాంకేతిక ఆవిష్కరణలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.
హైబ్రిడ్ మొబిలిటీ రోబో(హెచ్‌ఎంఆర్)
రోబోటిక్స్‌లో హైబ్రిడ్ మొబిలిటీ రోబోను టెక్ నిపుణులు ఒక సంచలనంగా చెబుతారు. ఇది బంతిని పోలి ఉండే ఎగిరే పరికరం. బంతిలాగా అన్నివైపులా కదులుతూ ఉంటుంది. అది వెళ్లే మార్గంలో ఏదైనా అడ్డంకి లేదా నిటారుగా ఉన్న నిర్మాణాలు ఎదురైతే పైకి కిందకు ఎగురుతూ ముందుకు సాగిపోతుంది.
హ్యూమని ఏఐ పిన్
హ్యూమని ఏఐ పిన్‌ను మొదటిసారిగా ఏప్రిల్ 2023లో జరిగిన టెడ్ కాన్ఫరెన్స్‌లో ఆవిష్కరించారు. ఇది రోజువారి ఫోన్‌కాల్‌లు చేయడం, రోజువారి కార్యకలాపాలను విశ్లేషించడం, ఆహార పదార్థాలను స్కాన్ చేయడం వంటి కొన్ని అంశాలను ప్రదర్శించారు. ఈ పరికరం సెప్టెంబరు 2023లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మరోసారి దర్శణమిచ్చింది.
ఎయిర్‌బ్యాగ్ జీన్స్
స్వీడిష్ కంపెనీ మోసైకిల్ ఎయిర్‌బ్యాగ్ జీన్స్‌ను తయారుచేసింది. మోటార్‌సైకిల్ ఢీకొనేటప్పుడు ఈ జీన్స్ ధరిస్తే కొంత ప్రమాదాన్ని నివారించవచ్చని కంపెనీ తెలిపింది. అందులో ఉండే సెన్సార్లు ప్రమాదం జరిగిన వెంటనే జీన్స్‌లో ఉన్న బ్యాగ్‌లో ఓపెన్ అయి ప్రమాదాన్ని కొంత నివారించేలా తోడ్పడతాయి. సాధారణంగా ఆ జీన్స్ ధరిస్తే మాములుగానే కనిపిస్తుంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం బ్యాగ్‌లు ఓపెన్‌అయి కొంత లావుగా ఉంటుంది.
అండర్‌వాటర్ జెట్‌ప్యాక్
నీటిలో అన్వేషణకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నీటిలో ప్రయాణం క్లిష్టంగా ఉంటుంది. ఆ ప్రయాణాన్ని సులువు చేసేందుకు అండర్‌వాటర్ జెట్‌ప్యాక్ అనే పరికరాన్ని తయారుచేశారు. దాన్ని వీపునకు ధరించి నీటిలో ప్రయాణించవచ్చు. రాకెట్ ఎలాగైతే ఆకాశంలో దూసుకుపోతుందో..ఈ పరికరం నీటిలో వర్టికల్‌గా ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది.
ఇదీ చదవండి: నైట్‌లో ముంబయి మొదటిస్థానం.. వీకెండ్‌లో..
ఫ్లైయింగ్ జెట్‌స్కి
కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న జెట్‌సన్ అనే కంపెనీ జెట్‌సన్ వన్ పేరుతో ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ లాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేస్తోంది. ఇది విద్యుత్‌శక్తి సాయంతో ఎగురుతుంది. జెట్‌సన్ వన్ వాహనం కారు కంటే వేగంగా పయనించగలదు. గంటకు 63 మైళ్లు అంటే 101 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15,00 అడుగుల ఎత్తు వరకూ ఎగరగలదు.
Comments
Please login to add a commentAdd a comment