దేశ వ్యాప్తంగా కొత్త ఏడాది ఎలా ఉండబోతుందోనని ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి ఈ తరుణంలో వ్యాపార రంగానికి అనుబంధంగా ఉన్న అన్నీ విభాగాల నిపుణులు భవిష్యత్ గురించి విశ్లేషకుల అభిప్రాయాలు, అంచనాలు వెలుగులోకి వచ్చాయి.
2024లో తొలి ఆరు నెలల కాలంలో 39 లక్షల ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని నిపుణుల అంచనా. మరి అదే సమయంలో ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారి జీత భత్యాల పెరుగుదలపై ఆసక్తి మొదలైంది.
ఊహించని పరిణామాలు
అయితే ఉద్యోగార్ధులకు 2024 సంవత్సరంలో ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. కంపెనీలకు ఆర్ధికపరమైన ఇబ్బందులు తప్పేలా లేవని.. వాటి నుంచి సురక్షితంగా ఉండేలా సిబ్బందికి ఇచ్చే బోనస్‌లు, ప్రమోషన్‌లకు ప్రభావితం చేసే ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉందని సమాచారం.
పెరిగే జీతం ఎంతంటే?
ఈ పరిణామాల దృష్ట్యా కంపెనీలు ఉద్యోగికి 8 శాతం నుండి 10 శాతం వరకు జీతం ఇంక్రిమెంట్‌లను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా, కొన్ని కీలక విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంకా ఎక్కువ జీతం ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇది అసమానతకు దారి తీస్తుంది అని టీమ్‌లీజ్ సర్వీసెస్ సీఈఓ కార్తీక్ నారాయణ్ చెప్పారు.
2024లో జీతం పెంపుదల అంచనా
గమనిక: ఈ గణాంకాలు బేసిక్ శాలరీ, పెరుగుదల, బోనస్‌లు, వేరియబుల్ పే లేదా ఇతర ప్రయోజనాలను కలిగి ఉండకపోవచ్చు. ఉద్యోగి అనుభవం, నైపుణ్యం ,కంపెనీ పనితీరు వంటి అంశాల ఆధారంగా ప్రతి సెక్టార్‌లో జీతం పెంపు ఉండకపోవచ్చని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment