ఈ ఏడాది ఆటోమొబైల్ రంగం మాత్రమే కాకుండా రియర్ ఎస్టేట్ రంగం కూడా బాగా ఊపందుకుంది. 2023వ సంవత్సరంలో అపార్ట్‌మెంట్లకు గిరాకీ భారీగా పెరిగిందని 'జేఎల్ఎల్ ఇండియా' (JLL India) వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ సంవత్సరం దేశంలోని ప్రధాన నగరాల్లో అపార్ట్‌మెంట్లకు డిమాండ్ బాగా పెరిగిందని ఢిల్లీ-NCR, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, పూణేలలో మొత్తం రెండు లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ ఇండియా తెలిపింది.
గతం కంటే ఈ ఏడాది 20 శాతం అమ్మకాలు పెరుగుతాయని, 2023 మొదటి తొమ్మిది నెలల్లో అమ్మకాలు 1,96,227 యూనిట్లు అని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. 2022 ఇదే సమయంలో మొత్తం విక్రయాన్ని 1,61,575 యూనిట్లు మాత్రమే అని కూడా నివేదికలో వెల్లడైంది.
వచ్చే ఏడాదికి అపార్ట్‌మెంట్ అమ్మకాలు 2.9 లక్షల నుంచి 3 లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని జేఎల్ఎల్ ఇండియా భావిస్తోంది. మార్కెట్లో అపార్ట్‌మెంట్స్ కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో 2024లో కూడా సేల్స్ తారా స్థాయికి చేరనున్నట్లు స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: 2023లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు.. ఇవే!
అపార్ట్‌మెంట్స్ ధరలు, హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. దీంతో దేశంలో హోసింగ్ మార్కెట్ సజావుగా ముందుకు సాగుతుందని జేఎల్‌ఎల్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ 'సమంతక్ దాస్' తెలిపారు. రానున్న రోజుల్లో ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగం మరింత వేగం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment