హారర్ చిత్రాలంటే వెన్నులోంచి టెర్రర్ పుట్టాల్సిందే. అలా క్షణ క్షణం భయపడుతూ హారర్ చిత్రాలు చూడటంలో చాలామందికి ఓ కిక్ దొరుకుతుంది. ఆ భయమే వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడలా థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టి, వసూళ్లు రాబట్టడానికి కొందరు హారర్ చిత్రాలు చేస్తున్నారు. ఆ చిత్రాలేంటో తెలుసుకుందాం.
భ్రమ యుగంలో...
సుధీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో రకాల సినిమాల్లో నటించారు మమ్ముట్టి. ఈ ప్రయాణంలో ΄పొలిటికల్, థ్రిల్లర్, హారర్, సస్పెన్స్.. ఇలా ఎన్నో జానర్స్‌ను టచ్ చేశారాయన. తాజాగా ‘భ్రమ యుగం’ అనే హారర్ ఫిల్మ్‌లో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగే కథతో రాహుల్ సదా శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.
హారర్ రాజా
లవ్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాలతో సాగే చిత్రాలు చేస్తున్నప్పటికీ ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లోనే నటిస్తారు ప్రభాస్. అయితే తొలిసారి ప్రభాస్ హ్యూమర్‌తో కూడిన హారర్ అంశాలు ఉండే ఓ సినిమాలో నటిస్తున్నారు. మారుతి ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’, ‘వింటేజ్ కింగ్’, ‘అంబాసిడర్’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఈ చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తయిందని సమాచారం. మాళవికా మోహనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీ రోల్‌లో సంజయ్ దత్ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా టైటిల్, రిలీజ్‌లపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
చంద్రముఖి తిరిగొస్తే..
హారర్ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులు ‘చంద్రముఖి’ని అంత సులభంగా మర్చిపోలేరు. వెంకటపతి రాజుగా రజనీకాంత్, చంద్రముఖిగా జ్యోతిక వెండితెరపై ప్రదర్శించిన నటన అలాంటిది. ఇప్పుడు ‘చంద్రముఖి’ మళ్లీ వస్తోంది. కానీ రజనీ, జ్యోతికలు రావడం లేదు. ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా రూ΄పొందిన ‘చంద్రముఖి 2’లో రజనీ, జ్యోతికల స్థానాల్లో రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ నటించారు. ‘చంద్రముఖి’ని డైరెక్ట్ చేసిన పి. వాసుయే ‘చంద్రముఖి 2’ని తెరకెక్కించారు. ఈ చిత్రం సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది.
భైరవకోనలో ఏం జరిగింది?
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో ప్రేక్షకులను భయపెడుతూ, కథలో వీలైనప్పుడు నవ్వించారు దర్శకుడు వీఐ ఆనంద్. తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా ‘ఊరుపేరు
భైరవకోన’. ఇందులో సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్. ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో హారర్ అండ్ సస్పెన్స్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు ఇటీవల విడుదలైన టీజర్ స్పష్టం చేస్తోంది. భైరవకోన అనే ఊర్లో జరిగే కొన్ని కల్పిత ఘటనల సమాహారంగా ఈ సినిమా కథనం సాగనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
మంత్రం.. తంత్రం..
ప్రస్తుతం తెలుగులో ఫుల్ బిజీగా ఉన్న తెలుగు కథానాయికల్లో అనన్య నాగళ్ల ఒకరు. అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్న ఈ బిజీ అమ్మాయి లిస్ట్‌లో ‘తంత్ర’ అనే ఓ హారర్ ఫిల్మ్ కూడా ఉంది. తాంత్రిక శాస్త్రం, పురాణ గాధల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఈ చిత్రదర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి పేర్కొన్నారు. ధనుష్ (దివంగత నటుడు శ్రీహరి తమ్ముడు కొడుకు) నటుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సలోని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఓ మంచి దెయ్యం
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ప్రేమకథా చిత్రమ్ 2’.. ఇలా హీరోయిన్ నందితా శ్వేతకు హారర్ జానర్‌లో నటించిన అనుభవం ఉంది. ఈ క్రమంలో నందితా శ్వేత చేసిన మరో హారర్ ఫిల్మ్ ‘ఓఎమ్‌జీ’. ‘ఓ మంచి ఘోస్ట్’ ఉపశీర్షిక. ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, నవమి గాయక్ ఈ సినిమాలో ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. మార్తాండ్ కె. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. మరి.. మంచి దెయ్యంగా నందితా శ్వేత ఏ రేంజ్‌లో భయపెడతారో చూడాలి.
కేరాఫ్ దెయ్యం
గ్రామాల్లో ఒకప్పుడు మాతంగులుగా జీవించిన వారి జీవితాల ఆధారంగా రూ΄పొందుతున్న హారర్ ఫిల్మ్ ‘భయం కేరాఫ్ దెయ్యం’. ఈ చిత్రంలో ఓ
మాతంగిగా రమ్య, మాంత్రికుడిగా రవిబాబు, తాంత్రికుడిగా సత్యప్రకాష్ నటిస్తున్నారు. సీవీఎమ్ వెంకట రవీంద్రనాథ్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూ΄పొందుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
తంతిరం
హారర్ అంశాలతో కూడిన కుటుంబ కథాచిత్రం ‘తంతిరం’. భార్యాభర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ప్రభావితం అవుతుందనేది ఈ సినిమా కథాంశం. మెహర్ దీపక్ దర్శకుడు. ఈ సినిమా మేజర్ షూటింగ్ కేరళలో జరి గింది. శ్రీకాంత్, ప్రియాంక లీడ్ రోల్స్ చేశారు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రాలే కాదు.. హారర్ జానర్‌లో ప్రేక్షకులను భయ పెట్టే మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి.
Upcoming Horror Movies 2023: ఈ సినిమాలు చూస్తే.. క్షణ క్షణం భయం.. భయం
Published Sun, Aug 20 2023 4:48 AM | Last Updated on Mon, Aug 21 2023 12:16 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment