Horror films
-
థియేటర్లలో మిమ్మల్ని భయపెట్టేందుకు వస్తున్న సినిమాలు ఇవే..
హారర్ చిత్రాలంటే వెన్నులోంచి టెర్రర్ పుట్టాల్సిందే. అలా క్షణ క్షణం భయపడుతూ హారర్ చిత్రాలు చూడటంలో చాలామందికి ఓ కిక్ దొరుకుతుంది. ఆ భయమే వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడలా థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టి, వసూళ్లు రాబట్టడానికి కొందరు హారర్ చిత్రాలు చేస్తున్నారు. ఆ చిత్రాలేంటో తెలుసుకుందాం. భ్రమ యుగంలో... సుధీర్ఘమైన కెరీర్లో ఎన్నో రకాల సినిమాల్లో నటించారు మమ్ముట్టి. ఈ ప్రయాణంలో ΄పొలిటికల్, థ్రిల్లర్, హారర్, సస్పెన్స్.. ఇలా ఎన్నో జానర్స్‌ను టచ్ చేశారాయన. తాజాగా ‘భ్రమ యుగం’ అనే హారర్ ఫిల్మ్‌లో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగే కథతో రాహుల్ సదా శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. హారర్ రాజా లవ్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాలతో సాగే చిత్రాలు చేస్తున్నప్పటికీ ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లోనే నటిస్తారు ప్రభాస్. అయితే తొలిసారి ప్రభాస్ హ్యూమర్‌తో కూడిన హారర్ అంశాలు ఉండే ఓ సినిమాలో నటిస్తున్నారు. మారుతి ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’, ‘వింటేజ్ కింగ్’, ‘అంబాసిడర్’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఈ చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తయిందని సమాచారం. మాళవికా మోహనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీ రోల్లో సంజయ్ దత్ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా టైటిల్, రిలీజ్‌లపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. చంద్రముఖి తిరిగొస్తే.. హారర్ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులు ‘చంద్రముఖి’ని అంత సులభంగా మర్చిపోలేరు. వెంకటపతి రాజుగా రజనీకాంత్, చంద్రముఖిగా జ్యోతిక వెండితెరపై ప్రదర్శించిన నటన అలాంటిది. ఇప్పుడు ‘చంద్రముఖి’ మళ్లీ వస్తోంది. కానీ రజనీ, జ్యోతికలు రావడం లేదు. ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా రూ΄పొందిన ‘చంద్రముఖి 2’లో రజనీ, జ్యోతికల స్థానాల్లో రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ నటించారు. ‘చంద్రముఖి’ని డైరెక్ట్ చేసిన పి. వాసుయే ‘చంద్రముఖి 2’ని తెరకెక్కించారు. ఈ చిత్రం సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది. భైరవకోనలో ఏం జరిగింది? ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో ప్రేక్షకులను భయపెడుతూ, కథలో వీలైనప్పుడు నవ్వించారు దర్శకుడు వీఐ ఆనంద్. తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా ‘ఊరుపేరు భైరవకోన’. ఇందులో సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్. ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో హారర్ అండ్ సస్పెన్స్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు ఇటీవల విడుదలైన టీజర్ స్పష్టం చేస్తోంది. భైరవకోన అనే ఊర్లో జరిగే కొన్ని కల్పిత ఘటనల సమాహారంగా ఈ సినిమా కథనం సాగనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మంత్రం.. తంత్రం.. ప్రస్తుతం తెలుగులో ఫుల్ బిజీగా ఉన్న తెలుగు కథానాయికల్లో అనన్య నాగళ్ల ఒకరు. అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్న ఈ బిజీ అమ్మాయి లిస్ట్‌లో ‘తంత్ర’ అనే ఓ హారర్ ఫిల్మ్ కూడా ఉంది. తాంత్రిక శాస్త్రం, పురాణ గాధల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఈ చిత్రదర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి పేర్కొన్నారు. ధనుష్ (దివంగత నటుడు శ్రీహరి తమ్ముడు కొడుకు) నటుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సలోని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓ మంచి దెయ్యం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ప్రేమకథా చిత్రమ్ 2’.. ఇలా హీరోయిన్ నందితా శ్వేతకు హారర్ జానర్లో నటించిన అనుభవం ఉంది. ఈ క్రమంలో నందితా శ్వేత చేసిన మరో హారర్ ఫిల్మ్ ‘ఓఎమ్‌జీ’. ‘ఓ మంచి ఘోస్ట్’ ఉపశీర్షిక. ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, నవమి గాయక్ ఈ సినిమాలో ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. మార్తాండ్ కె. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. మరి.. మంచి దెయ్యంగా నందితా శ్వేత ఏ రేంజ్లో భయపెడతారో చూడాలి. కేరాఫ్ దెయ్యం గ్రామాల్లో ఒకప్పుడు మాతంగులుగా జీవించిన వారి జీవితాల ఆధారంగా రూ΄పొందుతున్న హారర్ ఫిల్మ్ ‘భయం కేరాఫ్ దెయ్యం’. ఈ చిత్రంలో ఓ మాతంగిగా రమ్య, మాంత్రికుడిగా రవిబాబు, తాంత్రికుడిగా సత్యప్రకాష్ నటిస్తున్నారు. సీవీఎమ్ వెంకట రవీంద్రనాథ్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూ΄పొందుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తంతిరం హారర్ అంశాలతో కూడిన కుటుంబ కథాచిత్రం ‘తంతిరం’. భార్యాభర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ప్రభావితం అవుతుందనేది ఈ సినిమా కథాంశం. మెహర్ దీపక్ దర్శకుడు. ఈ సినిమా మేజర్ షూటింగ్ కేరళలో జరి గింది. శ్రీకాంత్, ప్రియాంక లీడ్ రోల్స్ చేశారు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రాలే కాదు.. హారర్ జానర్లో ప్రేక్షకులను భయ పెట్టే మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. -
హారోయిన్స్
కథానాయికలు లేటెస్ట్ ట్రెండ్‌కి మారిపోయారు. ఓన్లీ గ్లామర్, సాంగ్స్‌కే కాదు. యాక్షన్ సినిమాలు చేయడానికైనా, బయోపిక్స్‌లో ఒదిగిపోవడానికైనా, థియేటర్స్‌లో ఆడియన్స్‌ను భయపెట్టడానికైనా సై అంటున్నారు. వారి ఉత్సాహాన్ని బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఆడియన్స్‌ను భయపెట్టి మంచి కలెక్షన్స్ రాబట్టుకోవడానికి భయమే అభయంగా బాక్సాఫీస్ వద్ద వెండితెర ఆత్మలుగా హారర్ సినిమాల కోసం ప్రిపేర్ అవుతున్న కొందరి హారోయిన్స్ గురించి తెలుసుకుందాం. ఐరాగా.. అందాల తార రెండేళ్ల క్రితం ‘డోరా’ సినిమాతో భయపెట్టడానికి ఆడియన్స్‌ను థియేటర్స్‌లోకి పిలిచారు నయనతార. కానీ ప్రేక్షకులు అంతగా భయపడలేదు. ఇప్పుడు ‘ఐరా’ సినిమాతో మరో సారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు నయన్. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో హారర్ అంశాలు పుష్కలంగానే ఉన్నట్లు అర్థం అవుతోంది. ఇందులో నయనతార డబుల్ రోల్ చేయగా ఒకటి డీ–గ్లామర్ రోల్ కావడం విశేషం. కేఎమ్. సర్జున్ దర్శకత్వం వహించిన ‘ఐరా’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. నయనతార ట్రిపుల్ టెర్రర్ కథానాయిక అంజలి చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమా లిస్ట్‌ను చెక్ చేస్తే అందులో మూడు హారర్ సినిమాలు (గీతాంజలి 2, ఓ, లీసా)ఉన్నాయి. 2004 లో వచ్చిన ‘గీతాంజలి’ సక్సెస్ సాధించింది. ఇప్పుడు సీక్వెల్‌కు ప్రిపేర్ అవుతున్నారు. మరో హారర్ మూవీ ‘లీసా’ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఈ సినిమాకు త్రీడీ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాని హిందీలో కూడా డబ్ చేయాలనుకుంటున్నారు. రాజు విశ్వనాథ్ దర్శకుడు. ఇక ‘ఓ’ సినిమా దగ్గరకు వస్తే... తన చుట్టూ ఏం లేకపోయినా ఏదో ఉందని ఊహించుకుని భయపడే క్యారెక్టర్లో అంజలి నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రవీణ్ దర్శకుడు. ఇలా.. ఈ ఏడాది ట్రిపుల్ హారర్ థమాకా ఇవ్వనున్నారు అంజలి. అంజలి మహా భయం తన సినీ కెరీర్లో 50వ చిత్రాన్ని కాస్త డిఫరెంట్‌గా ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యారు హన్సిక. ఆ ఆలోచనలోనే ‘మహా’ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. హారర్ అండ్ సస్పెన్స్‌తో కూడిన చిత్రమిది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ వివాదం అయ్యాయి. కానీ, టీమ్ మాత్రం ఎప్పటికప్పుడు డిఫరెంట్ పోస్టర్స్‌ను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు యుఆర్ జమీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. హన్సిక ఫాంటసీ హారర్ ప్రస్తుతం సౌత్‌లో మంచి బిజీగా ఉన్నారు రాయ్‌లక్ష్మీ. కన్నడలో ‘ఝాన్సీ’, తెలుగులో ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ’ సినిమాల షూటింగ్స్‌ను కంప్లీట్ చేసిన ఆమె ‘సిండ్రెల్లా’ అనే ఫ్యాంటసీ కమ్ హారర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇటీవలే సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వినోద్ వెంకటేశ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదలవుతోంది. రాయ్‌లక్ష్మీ థ్రిల్లింగ్ హారర్ థియేటర్లో ‘అరుంధతి’ సినిమా చూసిన ప్రేక్షకులు తర్వాత ఇంటికి ఒంటరిగా వెళ్లడానికి జంకేలా ఉన్నాయి ఆ సినిమాలో హారర్ సీన్స్. ఆ తర్వాత అనుష్క ‘పంచాక్షరి, భాగమతి’ వంటి సినిమాలను చేసినప్పటికీ ఆ రేంజ్ హిట్‌ను సాధించలేకపోయారనే చెప్పొచ్చు. మళ్లీ ఇప్పుడు ‘అరుంధతి’ రేంజ్లో ఆడియన్స్‌ను హడలెత్తించడానికి రెడీ అవుతున్నారట అనుష్క. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారామె. ఇది కేవలం హారర్ సినిమానే కాదు సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉంటాయట. ఇందులో మాధవన్, అంజలి, షాలినీ పాండే కూడా నటిస్తారు. కొంతమంది హాలీవుడ్ నటులు కూడా కనిపిస్తారట. మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ∙‘భాగమతి’లో అనుష్క ఎక్స్ట్రా ఫియర్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో ఆడియన్స్‌ను బాగానే కంగారు పెట్టారు నందితా శ్వేతా. ఇప్పుడామె ‘ప్రేమకథా చిత్రమ్ 2’ సినిమాలో నటిస్తున్నారు. 2013లో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ చిత్రానికి ఇది సీక్వెల్. ‘బ్యాక్ టు ఫియర్’ అనేది ఉపశీర్షిక. హరి కిషన్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నానీ ముఖ్య తారలుగా నటించారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన నందిత లుక్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో ‘దేవి 2’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 2016లో వచ్చిన దేవి (తెలుగులో ‘అభినేత్రి’) సినిమాకు ఇది సీక్వెల్. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నందితా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రభుదేవా, తమన్నా ముఖ్య తారలు. తమిళంలో ‘నర్మద’ అనే సినిమాకు కమిట్ అయ్యారు నందిత. ఈ సినిమాలో కూడా హారర్ అంశాలు ఉంటాయని టాక్. మరి.. ఈ మూడు సినిమాలతో నందితా ఆడియన్స్‌కు ఎక్స్ట్రా ఫియర్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. నందితా శ్వేతా హీరోలు కూడా హారర్ జానర్‌పై దృష్టిపెట్టారు. 2017లో ‘గృహం’ సినిమాతో బంపర్‌హిట్ అందుకున్న సిద్ధార్థ్ ఇప్పుడు ‘అరువమ్’ అనే హారర్ మూవీలో నటిస్తున్నారు. ‘ముని’ సిరీస్ మూవీస్‌తో రాఘవ లారెన్స్ ప్రేక్షకులను బాగా భయపెట్టారు. ఆయన తాజా హారర్ మూవీ ‘కాంచన 3’ (ముని 4) ఏప్రిల్‌లో విడుదల కానుంది. ‘నిను విడని నీడను నేనే’ చిత్రంతో తొలిసారి హారర్ జానర్లో నటిస్తున్నారు సందీప్ కిషన్. ‘చీకట్లో చితక్కొట్టుడు’ వంటి చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరిక్షీంచుకోవడానికి రెడీ అవుతున్నాయి. సిద్ధార్థ్, రాఘవ లారెన్స్ – ముసిమి -
పిశాచి వచ్చేస్తోంది!
‘‘చిత్రపరిశ్రమ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూస్తాను. కన్నడ హిట్ చిత్రాన్ని తెలుగులో ‘పిశాచి–2’గా విడుదల చేస్తున్నారు. ఇటీవల హర్రర్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది’’ అని మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. చిత్రం పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. స్వర్ణభారతి క్రియేషన్స్ పతాకంపై వీర భద్రచౌదరి దర్శకత్వంలో సాయివెంకట్ విడుదల చేస్తున్న చిత్రం ‘పిశాచి–2’. రోపేష్, సిప్రా కౌర్ జంటగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాతలు ప్రతాని రామకృష్ణగౌడ్, మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. ఏప్రిల్ 7న చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నామని సాయి వెంకట్ తెలిపారు. -
ఆమె... ఓ మోహం!
‘మోహిని’ అంటే మనసును మత్తులో ముంచేసే అందమని అర్థం. కథానాయిక త్రిష అందం కూడా అంతే. దాదాపు పధ్నాలుగేళ్లగా తన అందంతో, అభినయంతో వెండితెర మోహినిగా అభిమానులను మైమరిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ‘మోహిని’ అనే పాత్రతో మురిపించడమే కాదు.. భయపెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారామె. పధ్నాలుగేళ్ల కెరీర్లో గ్లామర్ పాత్రలకే కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రలకు కూడా ఓకే చెబుతూ వచ్చారు. ఈ మధ్య అయితే కథానాయిక ప్రాధాన్యంగా సాగే చిత్రాలపై మక్కువ చూపుతున్నట్లనిపిస్తోంది. అది కూడా హారర్ చిత్రాలు చేయడం విశేషం. ‘కళావతి’ తర్వాత ఓ హారర్ చిత్రాన్ని పూర్తి చేశారు త్రిష. ఇప్పుడు ‘మోహిని’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. మాధేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మోహిని పాత్ర కోసం త్రిష ప్రత్యేకంగా ప్రోస్థటిక్ మేకప్ కూడా వేసుకోనున్నారట. ఈ చిత్రం షూటింగ్ మొత్తం యూకే, మెక్సికోల్లో జరుగుతుంది. మోహిని అనే అమ్మాయికి ఎదురయ్యే భయానక అనుభవాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఈ చిత్రానికి హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారట. -
ప్రతీకారం తీర్చుకునే పాత్రలో త్రిష
అదృష్టవంతులైన హీరోయిన్లలో నటి త్రిష ఒకరని చెప్పవచ్చు. బహుభాషా నటిగా ప్రాచుర్యం పొందిన ఈ చెన్నై చిన్నది నటిగా 13 వసంతాలు పూర్తి చేసుకున్నా ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు. మధ్యలో కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్నా మళ్లీ గాడిలో పడ్డారు. ఆ మధ్య అరణ్మణై-2 చిత్రంలో దెయ్యంగా నటించిన త్రిషను వరుసగా అలాంటి హారర్ చిత్రాల అవకాశాలే వరించడం విశేషం. ప్రస్తుతం ద్విభాషా చిత్రం నాయకిలో నటిస్తున్న త్రిష ఇందులో ద్విపాత్రాభియనం చేస్తున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మకు మరో అవకాశం వచ్చింది. విషయం ఏమిటంటే ఇందులోనూ తను ద్విపాత్రాభినం చేయనున్నారు. ఇది కూడా హారర్ నేపథ్యంలో సాగే కథా చిత్రమేనని తెలిసింది. ఇందులో త్రిష దేశ దేశాలు తిరిగి తన పగ, ప్రతీకారాన్ని తీర్చుకుంటారట. వివరాల్లోకెళ్లితే.. ఇంతకు ముందు విజయ్ హీరోగా మధుర చిత్రాన్ని తెరకెక్కించిన మదేశ్ చాలా గ్యాప్ తరువాత మెగాఫోన్ పడుతున్నారు. ఇందులో త్రిష నాయకిగా నటించనున్నారు. కథ విషయానికి వస్తే త్రిష మూకుమ్మడి అత్యాచారానికి గురై మరణిస్తుందట. ఆమెను చెరపట్టిన వాళ్లు పలు దేశాల్లో నివశిస్తుంటారట. మరుజన్మ ఎత్తిన త్రిష తన ప్రతీకారం తీర్చుకోవడానికి దేశ దేశాలు తిరిగి వారిని ఎలా అంతం చేస్తారన్నదే కథ అని తెలిసింది. ఇంతకుముందు సింగం చిత్రాన్ని నిర్మించిన ప్రిన్స్ ప్రొడక్షన్స్ అధినేత లక్ష్మణన్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున్న నిర్మించనున్నారు. లండన్,మెక్సికో, జెనీవా, బల్గేరియా, రొమానియ దేశాల్లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. -
భయపెట్టే కాకి
హారర్ చిత్రాల హవా ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ మధ్యకాలంలో వచ్చిన హారర్ చిత్రాలు దాదాపు హిట్టయ్యాయి. ఇప్పుడు ‘కాకి’ పేరుతో మరో హారర్ చిత్రం రానుంది. అశోక్‌కుమార్, కిరణ్ పత్తికొండ, మేఘశ్రీ ప్రధాన పాత్రల్లో అర్పిత క్రియేషన్స్ పతాకంపై మనోన్ యం. దర్శకత్వంలో కిరణ్ పత్తికొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘సినిమా మొదటి భాగం వినోద ప్రధానంగా, రెండో భాగం హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో భయపెట్టేలా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఓవర్సీస్లలో డిసెంబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. జయసుధ, నాజర్, బేబి యువీనా తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శరవణన్ నటరాజన్, సంగీతం: అమ్రిత్, కథ-ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రొనాల్డ్ రాజ్ ఎస్. విలియమ్స్. -
గీతాంజలి మిస్సయ్యాను...త్రిపురకు సెట్ అయ్యాను!
‘‘నా కెరీర్లో నేను చేసిన తొలి హారర్ చిత్రం ‘త్రిపుర’. హారర్ చిత్రాలు చూస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది. అయితే, ఈ చిత్రంలో నటించేటప్పుడు భయపడలేదు’’ అని స్వాతి అన్నారు. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్ స్వాతి. చాలా తక్కువ సమయంలోనే పేరు తెచ్చుకున్నారామె. తమిళంలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ పదహారణాల తెలుగమ్మాయి రేపు ‘త్రిపుర’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మించిన ఈ చిత్రానికి రాజకిరణ్ దర్శకుడు. ఇక.. స్వాతి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. ‘త్రిపుర’ చిత్రంలో నేను దాదాపు చీరల్లోనే కనిపిస్తాను. ‘గోల్కొండ హై స్కూల్’లో నన్ను చీరల్లో చూసి, మరీ చిన్నపిల్లలా ఉన్నావన్నారు. అందుకే త్రిపుర పాత్ర కోసం బరువు పెరిగాను. నిజజీవితంలో ఓ గృహిణి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో అలా కనిపిస్తాను. ఇంతకుముందు ఈ చిత్రదర్శకుడు రాజకిరణ్ దర్శకత్వం వహించిన ‘గీతాంజలి’కి నన్నడిగారు. అప్పుడు డేట్స్ ఖాళీ లేక చేయలేకపోయాను. ఈ చిత్రం చేస్తున్నప్పుడు రాజకిరణ్ చెప్పిన పలు విషయాలు నన్ను ఆసక్తికి గురి చేశాయి. ఓ దెయ్యంతో ఆయన మూడు నెలలు సావాసం చేశారట. సినిమా అంటే ఆయనకు ఎంతో ప్యాషన్ ఉంది. ‘త్రిపుర’ను చాలా బాగా తీశారు. ఈ సినిమాలో త్రిపురకు వచ్చే కలలు నిజమవుతుంటాయి. భర్తతో హాయిగా సంసారం సాగిస్తున్న సమయంలో త్రిపురకు వచ్చిన ఒక కల వాళ్ల జీవితాన్ని ఎలా మార్చేసింది? అనేది కథ. నేను దెయ్యాలను, సూపర్ న్యాచురల్ పవర్స్నీ నమ్మను. విధినీ, కర్మనూ నమ్ముతాను. ఇది దెయ్యం సినిమా కాదు. థ్రిల్లర్ మూవీ. నవ్విస్తూ, థ్రిల్‌కి గురి చేస్తుంది. సినిమా చేసేటప్పుడు నేనూ థ్రిల్ అయ్యాను. ముఖ్యంగా పెళ్లి సీన్లో. నిజంగా పెళ్లి జరుగుతుందేమో అనే ఫీలింగ్ కలిగింది. తెలుగు సినిమాలు ఎందుకు చేయడంలేదు? అనే ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. దర్శక, నిర్మాతలనే అడగాలి. షూటింగ్స్ లేనప్పుడు మా అమ్మా నాన్నలతో స్పెండ్ చేస్తాను. నాక్కాబోయే భర్త ఎలా ఉండాలో వాళ్లతో చెబుతుంటాను. నన్ను బాగా అర్థం చేసుకోగలడు అనే నమ్మకం కుదిరిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి తర్వాత సినిమాలు చేయాలా? మానేయాలా? అనేది నిర్ణయించుకోలేదు. పెళ్లి తర్వాత హాయిగా నా ఇంటిని చక్కబెట్టుకోవాలని అనుకుంటున్నాను. -
త్రిష అప్పటి నాయకి
హార్రర్ చిత్రాలు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. త్రిష కూడా ఆ ట్రెండ్ ఫోలో అవుతూ ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమైపోయారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాయకి’. గణేశ్ వెంకట్రామన్, సత్యం రాజేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గిరిధర్ హౌస్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోవి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరించారు. త్రిష మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా దర్శకుడు గోవి అయిదు నిమిషాలు కథ చెప్పగానే హిట్ అనిపించింది. 1980లో జరిగే కథ ఇది. నా ఫేవరేట్ జోనర్ అయిన హార్రర్ చిత్రంలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. దర్శకుడు గోవి మాట్లాడుతూ- ‘‘నా కథకు తగ్గట్టుగా 18 ఏళ్ల అమ్మాయి కావాలి, అలాగే మెచ్యూర్డ్ అమ్మాయి కూడా కావాలి. ఇలా రె ండు విభిన్న కోణాలున్న పాత్రలకు ఎవరు సెట్ అవుతారా అని ఆలోచిస్తే, టక్కున త్రిష పేరు ఫ్లాష్ అయింది. ఒక త్రిష ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది’’ అని అన్నారు. ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, కెమెరా: జగదీశ్ చీకటి సంగీతం: రఘు కుంచె, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాంబాబు కుంపట్ల. -
లారెన్స్‌తో జ్యోతిక?
లారెన్స్‌తో నటి జ్యోతిక నటించనున్నారా? దీనికి అలాంటి అవకాశం లేకపోలేదనే సమాధానం కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. కాంచన, కాంచన-2 చిత్రాల విజయాలతో మంచి జోష్‌లో ఉన్న లారెన్స్ హర్రర్‌తో కూడిన వినోదభరిత చిత్రాలను తెరకెక్కించడంలో దిట్టగా నిరూపించుకున్నారు. అంతేకాదు తాజాగా మొట్టశివ కెట్టశివ, నాగ అనే మరో రెండు భారీ హారర్ చిత్రాల నిర్మాణానికి ఇటీవలే శ్రీకారం చుట్టారు. ఈ రెండు చిత్రాల్లోనూ తనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. కాగా మొట్టశివ కెట్టశివ చిత్రంలో నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఇక నాగ చిత్రంలో హీరోయిన్ కోసం నటి జ్యోతిక పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. జ్యోతిక సుధీర్గ విరామం తరువాత 36 వయదినిలే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం విడుదలై విజయం సాధించినా ఆమె మరో చిత్రం ఏదీ ఒప్పుకోలేదు. సూర్య జ్యోతిక జంటగా చిత్రాలు చేయడానికి పలువురు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు కథలు విన్న సూర్యను ఒక కథ ఇంప్రెస్ చేసినట్లు సమాచారం. త్వరలో తన భర్త సూర్యతో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని సమీపకాలంలో సూర్యనే స్వయంగా వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో లారెన్స్ నాగ చిత్రంలో జ్యోతికను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. లరెన్స్ జ్యోతికకు కథ విపించినట్లు, త్వరలోనే ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాగ గ్రాఫిక్స్ మయంగా సాగే హర్రర్ కామెడీ కథా చిత్రంగా రూపొందనుంది. ఈ తర హా పాత్రలో జ్యోతికి చంద్రముఖి చిత్రంలో అదరగొట్టార న్న విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉండదనుకుంటా. బహుశ లారెన్స్ కూడా ఇలాంటి ఆలోచనతోనే ఆమెను ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారేమో. -
లార్డ్ ఆఫ్ ది ఆస్కార్స్
లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ బి. విఠలాచార్య తెలుసా? మాయలు, మంత్రాలు, కత్తులు, బాణాల ఫైటింగులకు క్రేజ్ తెచ్చిన దర్శక మొనగాడు. హాలీవుడ్ చిత్రం ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ చూస్తుంటే, అచ్చంగా మనకు బ్లాక్ అండ్ వైట్ విఠలాచార్య సినిమాలు గుర్తుకురాకపోతే ఒట్టు! అందుకే, పిల్లల నుంచి పెద్దల దాకా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది - ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’. ఇది మొత్తం మూడు భాగాల సిరీస్. వాటిలో మూడోదీ, ఆఖరుదీ ఈ ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్’. పుష్కరకాలం క్రితం విడుదలైన ఈ థర్డ్ పార్ట్ది అరుదైన రికార్డ్! అకాడమీ అవార్డులు ఆరంభమైన తరువాత అత్యధిక సంఖ్యలో (11) ఆస్కార్ అవార్డులు అందుకున్న సినిమాలు - ‘బెన్హర్’ (1959), ‘టైటానిక్’ (1997). ఆ తరువాత మళ్ళీ ఇదే. ‘ఉత్తమ చిత్రం’తో సహా నామినేటైన 11 కేటగిరీల్లోనూ ఆస్కార్ అవార్డుల్ని స్వీప్ చేసింది. ఇది మామూలుగా ఆస్కార్స వచ్చే చిత్రాలకు భిన్నమైన సినిమా. మరుగుజ్జులు, మనుషులలానే కనిపిస్తూ పాదాలకు జుట్టుండే మూడడుగుల మనుషులైన వారి హాబి ట్లు, అతీతశక్తులుండే చిట్టి పొట్టి జంతువులు, మ్యాజిక్ రింగులతో నిండిన ఫ్యాంటసీ. నటీనటులు కూడా జనానికి తెలిసినవాళ్ళేమీ కాదు. లో-బడ్జెట్ హార్రర్ చిత్రాలు తీసే ఫిల్మ్ మేకరేమో (పీటర్ జాక్సన్) దర్శకుడు. పైగా, సినిమాలకు అవార్డులొచ్చే లాస్ ఏంజెల్స్‌కు దూరంగా రచన, చిత్రీకరణ, ఎడిటింగ్ - మొత్తం న్యూజిలాండ్‌లో జరిగాయి. అయినాసరే ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ ఆస్కార్లు గెలుచుకుంది. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాపీలు అమ్ముడైన నవలల్లో ఒకటి -‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’. జాన్ రొనాల్డ్ రూయెల్ టోల్కిన్ మొత్తం మూడు సంపుటాలుగా ఈ నవల రాశారు. ఈ నవలను సినిమా కన్నా ముందే రేడియాలో, రంగస్థలం మీద వేశారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో 1937 నుంచి 1949 మధ్య ఈ రచన సాగింది. మిడిల్ ఎర్త్ ప్రాంతంలో... ఎల్విష్ భాష మాట్లాడే కొన్ని జాతుల మధ్య జరిగినట్లుగా టోల్కిన్ ఈ కాల్పనిక కథను అల్లారు. నవలా రచయిత టోల్కిన్కు ఒక అలవాటుంది. ప్రపంచంలో కనుమరుగైపోతున్న భాషలను దృష్టిలో పెట్టుకొని, ప్రస్తుతం ఉన్న భాషల ప్రాథమిక సూత్రాలనూ, మాండలికాలనూ వాడుకుంటూ, వాటికి తన ఆలోచన జోడించి, సరికొత్త భాషలో కవితలు, పాటలు రాయడం ఆయన హాబీ. ఈ నవలలో యువరాణి ఆర్వెన్ పాత్రధారిణి మాట్లాడేది - ఎల్విష్ భాష. షూటింగ్లో ఆ పాత్రధారిణికి ఈ భాష నేర్పడానికి సెట్స్ మీదే ఒక కోచ్‌ను పెట్టారు. వాళ్ళిద్దరికీ అర్థం కానిది ఏమైనా ఉంటే వివరించడానికి ఒక నిపుణుణ్ణి అమెరికాలో సిద్ధంగా ఉంచారు. అసలీ ప్రసిద్ధ నవలను సినిమాగా తీయాలని 1969లోనే హక్కులు తీసుకున్నారు. అప్పటికే సైన్స్ ఫిక్షన్ సినిమా ‘2001: ఎ స్పేస్ ఒడిస్సీ’తో దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్ ఒక సంచలనం. ఆయనతో ఈ నవలను తెరకెక్కించాలనుకున్నారు. కానీ, బోలెడన్ని పాత్రలు, చాంతాడంత కథ ఉన్న ఇంత నవలను చిన్న సినిమాగా కుదించలేమంటూ నో చెప్పారట. మంచికో, చెడుకో అలా ఆగిన ఆ వెండితెర కల 30 ఏళ్ళ తరువాత పీటర్ జాక్సన్ దర్శకత్వంలో నిజమైంది. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ మూడు పార్ట్‌లుగా వచ్చినా, తీయడం మాత్రం అన్నీ ఒకేసారి తీసేశారు. ఏణ్ణర్ధం పాటు ఏకధాటిగా షూటింగ్ జరిపారు. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటూ, ఒక్కో పార్ట్‌గా రిలీజ్ చేశారు. ఫస్ట్ పార్ట్ ఏమో - ‘ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్’. రెండో పార్టేమో - ‘ది టు టవర్స్’. నవలలోని రెండు, మూడు సంపుటాలను కలిపి ఈ మూడో పార్ట్ సినిమా ‘ది రిటర్న్ ఆఫ్ ది కింగ్’ తీశారు. న్యూజిలాండ్‌లో వందకు పైగా వేర్వేరు లొకేషన్స్... 350కి పైగా సెట్స్ వాడారు. ఈ లొకేషన్స్‌కు యాక్టర్లనీ, టెక్నీషియన్లనీ హెలికాప్టర్లో తరలించేవారు. సుదీర్ఘంగా సాగిన షూటింగ్లో, యుద్ధ సన్నివేశాల్లో దెబ్బలు తగలనివాళ్ళంటూ లేరు. కిందపడ్డారు. కాళ్ళు మెలికపడ్డాయి. వేళ్ళు విరిగాయి. కండరాలు పట్టేశాయి. వాపులు... గాయాలు... రక్తాలు... అయినా సరే ఆగకుండా సినిమా చేశారు. ఆ కష్టం వృథా కాలేదు. ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ ఫస్ట్ పార్ట్ ప్రీమియర్ షో వేశారు. జనంలోకి సినిమా వెళ్ళీవెళ్ళగానే ఆ చిత్రంలోని ప్రధాన పాత్రధారులందరూ రాత్రికి రాత్రికి జనంలో సూపర్స్టార్లైపోయారు. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ సిరీస్‌లో మూడు సినిమాలూ గొప్పగా ఉంటాయి. మూడింటికీ బోలెడన్ని అవార్డులు వచ్చాయి. ఈ సినిమాల కోసం కాస్ట్యూమ్, మేకప్ బృందాలు వెయ్యి యుద్ధ కాస్ట్యూమ్‌లు చేశాయి. ముఖానికి 10 వేల ప్రోస్థెటిక్స్ చేశారు. ఏకంగా 1800 హాబిట్ పాదాల తయారీ ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’కు ఎక్కింది. ఒక్క మూడో పార్ట్‌లో దాదాపు 1500 విజువల్ ఎఫెక్ట్ షాట్స్ ఉన్నాయి. ఒక్కో పార్ట్ రిలీజైన కొద్దీ ఈ సిరీస్‌కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. 2003 చివరలో మూడో పార్ట్ వచ్చింది. ప్రపంచ సినీ చరిత్రలో 100 కోట్ల డాలర్లు వసూలు చేసిన రెండో సినిమా ఇదే. మూడో పార్ట్‌లో 1700 మందికి పైగా పేర్లు రోలింగ్ టైటిల్స్‌లో వస్తాయి. ఆ టైటిల్స్ నిడివే - తొమ్మిదిన్నర నిమిషాలు. అంత మంది శ్రమకు ఫలితమైన ఈ సినిమా ఇవాళ చూసినా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. వీలుంటే చూడండి. సమ్మర్లో 3 పార్ట్‌లూ ఒక దాని తరువాత ఒకటిగా పిల్లలకూ డి.వి.డి.లో చూపెట్టండి. - రెంటాల -
ఆ సినిమాలకు నేను దూరం: త్రిష
ప్రేక్షకుల్నిఅస్సలు భయపెట్టనంటోంది హీరోయిన్ త్రిష. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ చెన్నై చిన్నది.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 16 ఏళ్లు దాటినా ఇంతవరకు హారర్ చిత్రాలు చేయకపోవటం గమనార్హం. త్రిష తన కెరీర్లో దాదాపు 50 సినిమాల్లో నటించినా.. ఏ చిత్రంలోనూ ఆమె ప్రేక్షకుల్ని భయపెట్టే పాత్రలు పోషించలేదు. అయితే అటువంటి కథలు తనకు చాలానే వచ్చాయని, అయితే ఇష్టం లేని పాత్రలు చేయనని త్రిష నిర్మొహమాటంగా చెప్పేసింది. కాగా తనతో పాటు కెరీర్ ప్రారంభించిన... మిగతా హీరోయిన్లు అనుష్క, చార్మి, ప్రియమణి, అంజలి, రాయ్‌లక్ష్మి ఇప్పటికే హారర్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే విభిన్న పాత్రల్లో కనిపించిన త్రిష మాత్రం తాను ఎప్పటికీ హారర్ చిత్రాలు చేయనని స్పష్టం చేసింది. ప్రస్తుతం త్రిష 'లయన్' చిత్రంలో బాలకృష్ణ సరసన నటిస్తోంది. -
ఆ రోజు అర్ధరాత్రి...
కనువిప్పు హారర్ సినిమాలు చూడడం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. సినిమా చూస్తున్నంత సేపు భయమనిపించేది కాదు. అయిపోయాక మాత్రం అందులోని సన్నివేశాలు గుర్తుకు వచ్చి తెగ భయపడేవాడిని. నాన్నను గట్టిగా పట్టుకొని పడుకునేవాడిని. ‘‘చూడడం ఎందుకు? భయపడడం ఎందుకు?’’ అని నాన్న నాకు క్లాసు తీసుకున్నా...నా అలవాటును మాత్రం మార్చుకోలేక పోయేవాడిని. హాల్లో చూసిన సినిమాలు చాలవన్నట్లు హారర్ సినిమాల డీవిడీలు తెచ్చుకొని చూసేవాడిని. ఇంటర్మీడియట్లో చేరడం కోసం విజయవాడకు వచ్చి ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి రూమ్ తీసుకున్నాను. ఇక్కడ కూడా నా అలవాటు మారలేదు. పైగా హారర్ నవలలు కూడా చదివేవాడిని. ఒకసారి... మా రూమ్మేట్లు ఇద్దరు ఏదో పనుండి ఊరికి వెళ్లారు. రూమ్‌లో నేను ఒక్కడినే ఉన్నాను. ఆరోజు త్వరగా పడుకున్నాను. అర్ధరాత్రి తరువాత... ఏదో చప్పుడై లేచాను. ఎవరో తలుపు బాదినట్లు అనుమానం వచ్చింది. ధైర్యం చేసి తలుపు తీశాను. అటూ ఇటూ చూశాను. ఎవరో నా వైపు వస్తున్నట్లు అనిపించి ‘కాపాడండి...’ అని గట్టిగా అరిచాను. అలా అరుస్తూనే ఉన్నాను. నా అరుపుల దెబ్బకు ఇంటి ఓనర్‌తో సహా కాలనీలో చాలామంది నిద్ర లేచారు. వాళ్లు ఎంత ధైర్యం చెప్పినా నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఆ రాత్రి ఇంటి ఓనర్ వాళ్ల ఇంట్లోనే పడు కున్నాను. విషయం తెలిసి మా నాన్నగారు వచ్చారు. నేను పిచ్చిపిచ్చిగా మాట్లాడడం చూసి కలత చెందారు. నన్ను హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. చాలారోజుల పాటు సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నాను. దీంతో చదువు అటకెక్కింది. చాలా నష్టం జరిగింది. దాన్ని నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ చదువు మీద శ్రద్ధ పెడుతున్నాను. మంచి మార్కులు సాధించి నాన్న కళ్లలో సంతోషం నింపాలని రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్నాను. -డి.కె, విజయవాడ -
హారర్ మూవీలను ఆదరించాలి
భారత్‌లో హారర్ సినిమాలను ప్రేక్షకులు ఆదరించాల్సిన అవసరముందని బాలీవుడ్ నటుడు జిమ్మీ శెర్గిల్ అభిప్రాయపడ్డారు. ‘హారర్ సినిమాలంటే ఎంతో ఇష్టం. ఇలాంటి సినిమాలను ఎక్కువగా రాత్రి, చీకటి సమయంలో చూసేం దుకు ఇష్టపడతాను. అప్పుడే థ్రిల్‌గా అనిపిస్తుంది. రాజ్, హంటెడ్ సినిమాలు ఎప్పుడు చూస్తుంటాన’ని జిమ్మీ బుధవారం మీడియాకు తెలి పారు. తనలాగే హారర్ సినిమాను చూసే ప్రేక్షకులు కొంత మంది ఉంటారని, అయితే ఈ మూవీలకు మరింత ఆదరణ పెరగాల్సిన అవసరముందని అన్నారు. హారర్ సినిమాల్లో నటించడంపై దృష్టి సారించానని, ఇందులో పాత్రలు విభిన్న అనుభూతిని కలిగిస్తాయని తెలిపారు. తాను సెక్యూరిటీ ఏజెంట్‌గా నటించిన డర్ (ఎట్‌దిరేట్) ద మాల్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కాలంలో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేశాయన్న దానిపై మాట్లాడుకుంటున్నారన్న జిమ్మీ తాను నటించిన ఈ మూవీ కూడా మంచి వ్యాపారం చేస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఈ సినిమా ఎక్కువగా రాత్రి వేళల్లో నగరంలోని వివిధ మాల్‌లలో చిత్రీకరణ జరిగిందన్నారు. అయితే తాను మాత్రం ఎక్కడా ఇబ్బంది పడకుండా సెక్యూరిటీ ఏజెంట్ పాత్రలో ఒదిగిపోయానని తెలిపారు. రాగిణి ఎంఎంఎస్ పేమ్ పవన్ కృపలాణి దర్శకత్వం వహించిన డర్ (ఎట్‌దిరేట్) ద మాల్ సినిమాలో నుశ్రాత్ బారుచా, అరిఫ్ జకారియా, అసిఫ్ బస్రా, నివేదిత భట్టాచార్య, శ్రద్ధా కౌల్ నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది.