పిశాచి వచ్చేస్తోంది! | pisachi-2 movie coming soon in telugu | Sakshi
Sakshi News home page

పిశాచి వచ్చేస్తోంది!

Published Mon, Mar 27 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

పిశాచి వచ్చేస్తోంది!

పిశాచి వచ్చేస్తోంది!

‘‘చిత్రపరిశ్రమ సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూస్తాను. కన్నడ హిట్‌ చిత్రాన్ని తెలుగులో ‘పిశాచి–2’గా విడుదల చేస్తున్నారు. ఇటీవల హర్రర్‌ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది’’ అని మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలచారి అన్నారు.

చిత్రం పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. స్వర్ణభారతి క్రియేషన్స్‌ పతాకంపై వీర భద్రచౌదరి దర్శకత్వంలో సాయివెంకట్‌ విడుదల చేస్తున్న చిత్రం ‘పిశాచి–2’. రోపేష్, సిప్రా కౌర్‌ జంటగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాతలు ప్రతాని రామకృష్ణగౌడ్, మల్కాపురం శివకుమార్‌ విడుదల చేశారు. ఏప్రిల్‌ 7న చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నామని సాయి వెంకట్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement