భయపెట్టే కాకి | Kaki movie | Sakshi
Sakshi News home page

భయపెట్టే కాకి

Published Mon, Nov 30 2015 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM

భయపెట్టే కాకి

భయపెట్టే కాకి

హారర్ చిత్రాల హవా ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ మధ్యకాలంలో వచ్చిన హారర్ చిత్రాలు దాదాపు హిట్టయ్యాయి. ఇప్పుడు ‘కాకి’ పేరుతో మరో హారర్ చిత్రం రానుంది. అశోక్‌కుమార్, కిరణ్ పత్తికొండ, మేఘశ్రీ ప్రధాన పాత్రల్లో అర్పిత క్రియేషన్స్ పతాకంపై మనోన్ యం. దర్శకత్వంలో  కిరణ్ పత్తికొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘సినిమా మొదటి భాగం వినోద ప్రధానంగా, రెండో భాగం హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో భయపెట్టేలా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఓవర్సీస్‌లలో డిసెంబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. జయసుధ, నాజర్, బేబి  యువీనా తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శరవణన్ నటరాజన్, సంగీతం: అమ్రిత్, కథ-ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రొనాల్డ్ రాజ్ ఎస్. విలియమ్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement