హారర్ మూవీలను ఆదరించాలి
హారర్ మూవీలను ఆదరించాలి
Published Wed, Jan 15 2014 11:01 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
భారత్‌లో హారర్ సినిమాలను ప్రేక్షకులు ఆదరించాల్సిన అవసరముందని బాలీవుడ్ నటుడు జిమ్మీ శెర్గిల్ అభిప్రాయపడ్డారు. ‘హారర్ సినిమాలంటే ఎంతో ఇష్టం. ఇలాంటి సినిమాలను ఎక్కువగా రాత్రి, చీకటి సమయంలో చూసేం దుకు ఇష్టపడతాను. అప్పుడే థ్రిల్‌గా అనిపిస్తుంది. రాజ్, హంటెడ్ సినిమాలు ఎప్పుడు చూస్తుంటాన’ని జిమ్మీ బుధవారం మీడియాకు తెలి పారు. తనలాగే హారర్ సినిమాను చూసే ప్రేక్షకులు కొంత మంది ఉంటారని, అయితే ఈ మూవీలకు మరింత ఆదరణ పెరగాల్సిన అవసరముందని అన్నారు. హారర్ సినిమాల్లో నటించడంపై దృష్టి సారించానని, ఇందులో పాత్రలు విభిన్న అనుభూతిని కలిగిస్తాయని తెలిపారు.
తాను సెక్యూరిటీ ఏజెంట్‌గా నటించిన డర్ (ఎట్‌దిరేట్) ద మాల్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కాలంలో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేశాయన్న దానిపై మాట్లాడుకుంటున్నారన్న జిమ్మీ తాను నటించిన ఈ మూవీ కూడా మంచి వ్యాపారం చేస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఈ సినిమా ఎక్కువగా రాత్రి వేళల్లో నగరంలోని వివిధ మాల్‌లలో చిత్రీకరణ జరిగిందన్నారు. అయితే తాను మాత్రం ఎక్కడా ఇబ్బంది పడకుండా సెక్యూరిటీ ఏజెంట్ పాత్రలో ఒదిగిపోయానని తెలిపారు. రాగిణి ఎంఎంఎస్ పేమ్ పవన్ కృపలాణి దర్శకత్వం వహించిన డర్ (ఎట్‌దిరేట్) ద మాల్ సినిమాలో నుశ్రాత్ బారుచా, అరిఫ్ జకారియా, అసిఫ్ బస్రా, నివేదిత భట్టాచార్య, శ్రద్ధా కౌల్ నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది.
Advertisement