ప్రతీకారం తీర్చుకునే పాత్రలో త్రిష | Trisha to act in one more horror film? | Sakshi
Sakshi News home page

ప్రతీకారం తీర్చుకునే పాత్రలో త్రిష

Published Sat, May 14 2016 4:31 AM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM

ప్రతీకారం తీర్చుకునే పాత్రలో త్రిష

ప్రతీకారం తీర్చుకునే పాత్రలో త్రిష

అదృష్టవంతులైన హీరోయిన్లలో నటి త్రిష ఒకరని చెప్పవచ్చు. బహుభాషా నటిగా ప్రాచుర్యం పొందిన ఈ చెన్నై చిన్నది నటిగా 13 వసంతాలు పూర్తి చేసుకున్నా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. మధ్యలో కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్నా మళ్లీ గాడిలో పడ్డారు. ఆ మధ్య అరణ్మణై-2 చిత్రంలో దెయ్యంగా నటించిన త్రిషను వరుసగా అలాంటి హారర్ చిత్రాల అవకాశాలే వరించడం విశేషం. ప్రస్తుతం ద్విభాషా చిత్రం నాయకిలో నటిస్తున్న త్రిష ఇందులో ద్విపాత్రాభియనం చేస్తున్నారు.

తాజాగా ఈ ముద్దుగుమ్మకు మరో అవకాశం వచ్చింది. విషయం ఏమిటంటే ఇందులోనూ తను ద్విపాత్రాభినం చేయనున్నారు. ఇది కూడా హారర్ నేపథ్యంలో సాగే కథా చిత్రమేనని తెలిసింది. ఇందులో త్రిష దేశ దేశాలు తిరిగి తన పగ, ప్రతీకారాన్ని తీర్చుకుంటారట. వివరాల్లోకెళ్లితే.. ఇంతకు ముందు విజయ్ హీరోగా మధుర చిత్రాన్ని తెరకెక్కించిన మదేశ్ చాలా గ్యాప్ తరువాత మెగాఫోన్ పడుతున్నారు. ఇందులో త్రిష నాయకిగా నటించనున్నారు. కథ విషయానికి వస్తే త్రిష మూకుమ్మడి అత్యాచారానికి గురై మరణిస్తుందట.

ఆమెను చెరపట్టిన వాళ్లు పలు దేశాల్లో నివశిస్తుంటారట. మరుజన్మ ఎత్తిన త్రిష తన ప్రతీకారం తీర్చుకోవడానికి దేశ దేశాలు తిరిగి వారిని ఎలా అంతం చేస్తారన్నదే కథ అని తెలిసింది. ఇంతకుముందు సింగం చిత్రాన్ని నిర్మించిన ప్రిన్స్ ప్రొడక్షన్స్ అధినేత లక్ష్మణన్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున్న నిర్మించనున్నారు. లండన్,మెక్సికో, జెనీవా, బల్గేరియా, రొమానియ దేశాల్లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement