ఆ సినిమాలకు నేను దూరం: త్రిష | trisha will never do a horror film | Sakshi
Sakshi News home page

ఆ సినిమాలకు నేను దూరం: త్రిష

Jan 29 2015 10:50 AM | Updated on Sep 2 2017 8:29 PM

ఆ సినిమాలకు నేను దూరం: త్రిష

ఆ సినిమాలకు నేను దూరం: త్రిష

ప్రేక్షకుల్నిఅస్సలు భయపెట్టనంటోంది హీరోయిన్ త్రిష.

ప్రేక్షకుల్నిఅస్సలు భయపెట్టనంటోంది హీరోయిన్ త్రిష. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ చెన్నై చిన్నది.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 16 ఏళ్లు దాటినా ఇంతవరకు హారర్ చిత్రాలు చేయకపోవటం గమనార్హం. త్రిష తన కెరీర్లో దాదాపు 50 సినిమాల్లో నటించినా.. ఏ చిత్రంలోనూ ఆమె ప్రేక్షకుల్ని భయపెట్టే పాత్రలు పోషించలేదు.

అయితే అటువంటి కథలు తనకు చాలానే వచ్చాయని, అయితే ఇష్టం లేని పాత్రలు చేయనని త్రిష నిర్మొహమాటంగా చెప్పేసింది. కాగా తనతో పాటు కెరీర్ ప్రారంభించిన... మిగతా హీరోయిన్లు అనుష్క, చార్మి, ప్రియమణి, అంజలి, రాయ్లక్ష్మి ఇప్పటికే హారర్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే విభిన్న పాత్రల్లో కనిపించిన త్రిష మాత్రం తాను ఎప్పటికీ హారర్ చిత్రాలు చేయనని స్పష్టం చేసింది. ప్రస్తుతం త్రిష 'లయన్' చిత్రంలో బాలకృష్ణ సరసన నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement