త్రిషతోనే నా పెళ్లి.... | Charmi and Trisha's Marriage turns interesting | Sakshi
Sakshi News home page

త్రిషతోనే నా పెళ్లి....

Published Sat, Nov 7 2015 9:02 AM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

త్రిషతోనే నా పెళ్లి....

త్రిషతోనే నా పెళ్లి....

చెన్నై : త్రిష ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. ఆ మధ్య నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌మణియన్‌తో ప్రేమ, ఆ తర్వాత ఎంగేజ్‌మెంట్ ...బ్రేకప్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు నటి చార్మీ, నికీషా పటేల్‌తో కలిసి ఆమె స్నేహమంటే ఇదేరా అన్నంత జోష్‌లో తుళ్లిపోతూ మరోసారి సంచలనం సృష్టించింది.  స్వేచ్ఛా విహంగంగా జీవించే ఈ ముగ్గురు 'రమ్‌' అనే చిత్రంలో నటిస్తున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం పొంగి పొర్లుతోంది. ఇటీవల ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ట్విట్టర్‌లో జరిపిన ముచ్చట్లు అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.

వారు ముగ్గురు అదిరే దుస్తులు ధరించి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సెల్పీ ఫోటోలను నటి త్రిష తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలను చూసిన నికీషా పటేల్ ...త్రిషను పొగడ్తలతో ముంచేస్తూ తన ట్విట్టర్‌లో పేర్కొంది.  ఇక నటి ఛార్మీ అయితే త్రిషతోనే నా పెళ్లి, ఆమెతోనే డేటింగ్ చేస్తా అంటూ రెచ్చిపోయింది. ఇవన్నీ అభిమానుల్ని పిచ్చపిచ్చగా ఎంటర్ టెయిన్ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement