
ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైనీస్ యానిమేటెడ్ సినిమా నే జా చరిత్ర సృష్టిస్తోంది. బాక్సాఫీస్ ముందుగా కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా గత చిత్రాల రికార్డ్‌లను తిరగరాస్తూ దూసుకుపోతోంది. జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నే జా ఇప్పటి వరకు 2.4 బిలియన్ యాన్స్ (2 వేల 4 వందల కోట్లకు పైగా) వసూళ్లు చేసినట్టుగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
చైనీస్ యానిమేటెడ్ సినిమాల చరిత్రలో ఇవే అత్యధిక వసూళ్లు కావటం విశేషం. ఇన్నాళ్లు 2016లో రిలీజ్ అయిన జుటోపియా పేరిట ఉన్న రికార్డ్‌ను నే జా చెరిపేసింది. భారతీయ ఇతిహాసాల్లోని పాత్రలను పోలిన క్యారెక్టర్స్‌తో రూపొందించిన ఈ సినిమాకు జోజి దర్శకుడు.
ఇప్పటికీ మంచి వసూళ్ల ను సాధిస్తూ దూసుకుపోతున్న ఈ యాక్షన్ అడ్వంచరస్ 3డీ యానిమేషన్ మూవీ ఫుల్ రన్‌లో 4.4 బిలియన్ యాన్ (4 వేల 420 కోట్లకు పైగా) కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. యానిమేషన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచిన నే జా ఓవరాల్‌గా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్ మూడో స్థానంలో నిలవటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment