Animation film
-
యంగ్ ముఫాసా వచ్చేస్తున్నాడు.. ట్రైలర్ చూశారా?
చిన్నా, పెద్దా అనే తేడా అందరినీ అలరించిన చిత్రం లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే లయన్ కింగ్-2 కూడా వచ్చింది. తాజాగా లయన్ ప్రీక్వెల్తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మేకర్స్.అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ లయన్ కింగ్ ప్రీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. 1994లో వచ్చిన ది లయన్ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. 2019లో జోన్ ఫావ్రూ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా ముఫాసా ది లయన్ కింగ్ ప్రీక్వెల్‌కు సంబంధించి ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిన పెంచేస్తున్నాయి. ముఫాసా చిన్నప్పటి కథను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ చిత్రంలో రఫీకిగా జాన్ కనీ, పుంబాగా సేథ్ రోజెన్, టిమోన్‌గా బిల్లీ ఐచ్నర్, సింబాగా డోనాల్డ్ గ్లోవర్, నాలాగా బియాన్స్ నోలెస్-కార్టర్ కనిపించనున్నారు. కాగా.. ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. -
నాన్నగారి ప్యాషన్ మమ్మల్ని నిలబెట్టింది
‘‘మా నాన్నగారు (అల్లు రామలింగయ్య) సినిమా ఇండస్ట్రీలో పని చేయాలనే లక్ష్యంతో పెట్టె సర్దుకుని అమ్మని ఊళ్లోనే వదిలేసి చెన్నై వెళ్లారు. ఆ ప్యాషనే ఈరోజు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది. దాన్ని ప్యాషన్ అనో, పిచ్చి అనో అనుకున్నా పర్లేదు. అలాంటి పిచ్చి ఉన్న రాజీవ్ అంటే నాకు తెలియని ప్రేమ, అభిమానం. ఆయన చిత్ర పరిశ్రమలోకి రావడం సంతోషంగా ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. యానిమేషన్ రంగంలో గుర్తింపు సంపాదించుకున్న గ్రీన్ గోల్డ్ గ్రూప్ అధినేతలు రాజీవ్ చిలక, శ్రీనివాస్ చిలక ‘చిలకప్రోడక్షన్’ బ్యానర్ పేరుతో చిత్ర నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ బ్యానర్ లోగోను నిర్మాతలు అల్లు అరవింద్, శరత్ మరార్ విడుదల చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘రాజీవ్ చేసిన ‘చోటా భీమ్’ని నేను తెలుగులో రిలీజ్ చేశాను. రాజమౌళి దగ్గరున్న ప్యాషన్‌ని రాజీవ్లో చూశాను’’ అన్నారు. ‘‘సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న శ్రీనివాస్, రాజీవ్‌లకు అభినందనలు’’ అన్నారు శరత్ మరార్. రాజీవ్ చిలక మాట్లాడుతూ– ‘‘లయన్ కింగ్’ సినిమా చూసి ఇలాంటి సినిమాను ఇండియాలో ఎందుకు తీయకూడదు?అనిపించింది. అలాంటి యానిమేషన్ సినిమా చేయాలనే లక్ష్యంతోనే ‘గ్రీన్ గోల్డ్ సంస్థ’ని ప్రారంభించాం. మా చిలకప్రోడక్షన్లో ప్రస్తుతానికి రెండు తెలుగు సినిమాలు, హిందీలో ఓ చిన్న పిల్లల సినిమా నిర్మిస్తున్నాం’’ అన్నారు. ‘ ‘2004లో కృష్ణ యానిమేషన్ సిరీస్‌ను ఆరంభించాం. 2008లో ఆరంభించిన ‘చోటా భీమ్’ ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ ప్రయాణంలో భాగంగా సినిమాలు నిర్మించడానికి చిలకప్రోడక్షన్స్ని స్టార్ట్ చేశాం’’ అని శ్రీనివాస్ చిలక అన్నారు. -
విశాఖలో అంతర్జాతీయ యానిమేషన్ చిత్ర నిర్మాణం
విశాఖ (ఏయూ క్యాంపస్): అంతర్జాతీయ యానిమేషన్ చిత్రం ‘నోహాన్ ఆర్క్’ విశాఖ కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. విశాఖ ఐటీ పార్కులోని సింబయాసిస్ టెక్నాలజీస్ సంస్థలో అమెరికా, బ్రెజిల్ దేశాలకు చెందిన నిర్మాతలు దీనిని నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.45 కోట్లను వెచ్చిస్తున్నారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో యానిమేషన్ ఫిల్మ్‌గా దీనిని రూపొందిస్తున్నట్టు సింబయాసిస్ టెక్నాలజీస్ సీఈవో ఓ.నరేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్ర నిర్మాణంలో భాగంగా సముద్రంలో తుపానులను సృష్టించే వీఎఫ్‌ఎస్‌ల కోసం ప్రత్యేక కంప్యూటర్లను వినియోగిస్తామన్నారు. ఇటువంటి అంతర్జాతీయ చిత్రాలు మరిన్ని నిర్మించడానికి వీలుగా వీఎఫ్ఎక్స్, లైవ్‌ల్యాబ్, డబ్బింగ్ స్టూడియో, ఫిల్మ్ ల్యాబ్‌లను సిద్ధం చేశామన్నారు. షార్ట్ ఫిల్మ్‌లు, యాడ్ ఫిల్మ్‌లు చిత్రీకరించి, ఎడిటింగ్, డబ్బింగ్ చేసే విధంగా అత్యున్నత సదుపాయాలను తమ సంస్థలో నెలకొల్పడం జరిగిందన్నారు. అంతర్జాతీయ యానిమేషన్ చిత్రాల రూపకల్పనలో విశాఖకు మంచి గుర్తింపు లభించినట్టుగా తాము భావిస్తున్నామన్నారు. చిత్ర నిర్మాణం చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ఐటీ శాక మంత్రి గుడివాడ అమర్నాథ్కు సోమవారం సాయంత్రం నరేష్కుమార్ వివరించగా.. ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
చోప్రా సిస్టర్స్ మాట సాయం
ఇటీవల హాలీవుడ్ సినిమాలను మన ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రాంత సూపర్ స్టార్స్‌తోనూ ప్రమోట్ చేయిస్తున్నాయి ఆ చిత్ర నిర్మాణ సంస్థలు. తాజాగా తమ కొత్త యానిమేషన్ చిత్రం ‘ఫ్రాజెన్ 2’ను కూడా అదే స్టయిల్లో ప్రమోట్ చేస్తోంది డిస్నీ సంస్థ. ఎల్సా, అన్నా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథే ‘ఫ్రాజెన్’ ముఖ్యాంశం. హిందీ వెర్షన్లో ఈ పాత్రలకు చోప్రా సిస్టర్స్ (ప్రియాంకా చోప్రా, పరిణీతీ చోప్రా) వాయిస్ ఓవర్ అందించనున్నారు. ‘‘మిమి, తిషా (ప్రియాంక, పరిణితీ ముద్దు పేర్లు) ఇప్పుడు ఎల్సా, అన్నా కాబోతున్నారు. ఇలాంటి అద్భుతమైన, ధైర్యవంతమైన పాత్రలకు మా వాయిస్‌ను అందించడం ఆనం దంగా ఉంది’’ అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ చిత్రం నవంబర్ 22న రిలీజ్ కానుంది. -
రికార్డ్ సృష్టించిన ‘నే జా’
ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైనీస్ యానిమేటెడ్ సినిమా నే జా చరిత్ర సృష్టిస్తోంది. బాక్సాఫీస్ ముందుగా కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా గత చిత్రాల రికార్డ్లను తిరగరాస్తూ దూసుకుపోతోంది. జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నే జా ఇప్పటి వరకు 2.4 బిలియన్ యాన్స్ (2 వేల 4 వందల కోట్లకు పైగా) వసూళ్లు చేసినట్టుగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. చైనీస్ యానిమేటెడ్ సినిమాల చరిత్రలో ఇవే అత్యధిక వసూళ్లు కావటం విశేషం. ఇన్నాళ్లు 2016లో రిలీజ్ అయిన జుటోపియా పేరిట ఉన్న రికార్డ్‌ను నే జా చెరిపేసింది. భారతీయ ఇతిహాసాల్లోని పాత్రలను పోలిన క్యారెక్టర్స్‌తో రూపొందించిన ఈ సినిమాకు జోజి దర్శకుడు. ఇప్పటికీ మంచి వసూళ్ల ను సాధిస్తూ దూసుకుపోతున్న ఈ యాక్షన్ అడ్వంచరస్ 3డీ యానిమేషన్ మూవీ ఫుల్ రన్లో 4.4 బిలియన్ యాన్ (4 వేల 420 కోట్లకు పైగా) కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. యానిమేషన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచిన నే జా ఓవరాల్‌గా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్ మూడో స్థానంలో నిలవటం విశేషం. -
‘ద లయన్ కింగ్’ తొలి ట్రైలర్
1994లో ఘనవిజయం సాధించిన యానిమేషన్ ఫిలిం ద లయన్ కింగ్. ఇప్పుడు అదే సినిమాను మరింత ఉన్నత ప్రమాణాలతో 3డీ యానిమేషన్లో రూపొందిస్తున్నారు ద లయన్ కింగ్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు జోన్ ఫావ్రే దర్శకుడు. ఈ చిత్రంలోని యానిమేషన్ పాత్రలకు హాలీవుడ్ టాప్ స్టార్స్ డబ్బింగ్ చెప్పటం విశేషం. తాజాగా రిలీజ్ అయిన ద లయన్ కింగ్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు జోన్ ఫావ్రే ట్వీట్ చేసిన టీజర్‌ను షేర్ చేస్తున్నారు. ఇప్పటికే డిస్నీ సంస్థ నుంచి యానిమేషన్లుగా సక్సెస్ అయిన సిండ్రెల్లా, ద జంగల్ బుక్, బ్యూటీ అండ్ ద బీస్ట్‌లు 3డీలోనూ ఆకట్టుకోగా అదే బాటలో ద లయన్ కింగ్ కూడా విజయం సాధిస్తుందన్ననమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా 2019 జూలై 19న రిలీజ్ కానుంది. -
8 వేల కోట్ల హిట్‌కు... సీక్వెల్
ప్రపంచంలోనే అత్యధిక మొత్తం వసూలు చేసిన యానిమేషన్ చిత్రం ఏదో తెలుసా? వాల్ట్‌డిస్నీ సంస్థ రూపొందించిన - ‘ఫ్రోజెన్’. ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 127 కోట్ల డాలర్లు (అంటే మన లెక్కల్లో దాదాపుగా 8 వేల కోట్ల రూపాయలు) వసూలు చేసింది. అంతేకాకుండా, ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగానూ, ‘లెట్ ఇట్ గో...’ అనే పాటకు ఉత్తమ గీతంగానూ రెండు ఆస్కార్ అవార్డులు కూడా అందుకుంది. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ రానుంది. ‘ఫ్రోజెన్ 2’ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు డిస్నీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. దాంతో, ‘ఫ్రోజెన్’ చిత్రంలో పాపులరైన అన్నా, ఒలాఫ్ ది స్నోమ్యాన్ లాంటి పాత్రలు మళ్ళీ ప్రాణం పోసుకోనున్నాయి. ‘‘ఈ సరికొత్త ప్రయత్నం ద్వారా ప్రేక్షకులను మళ్ళీ ఆ యానిమేషన్ పాత్రల ప్రపంచంలోకి తీసుకెళ్ళనున్నాం’’ అంటూ చిత్ర నిర్మాణ వర్గాలు ప్రకటించాయి.