1994లో ఘనవిజయం సాధించిన యానిమేషన్ ఫిలిం ద లయన్ కింగ్. ఇప్పుడు అదే సినిమాను మరింత ఉన్నత ప్రమాణాలతో 3డీ యానిమేషన్లో రూపొందిస్తున్నారు ద లయన్ కింగ్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు జోన్ ఫావ్రే దర్శకుడు. ఈ చిత్రంలోని యానిమేషన్ పాత్రలకు హాలీవుడ్ టాప్ స్టార్స్ డబ్బింగ్ చెప్పటం విశేషం.
తాజాగా రిలీజ్ అయిన ద లయన్ కింగ్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు జోన్ ఫావ్రే ట్వీట్ చేసిన టీజర్‌ను షేర్ చేస్తున్నారు. ఇప్పటికే డిస్నీ సంస్థ నుంచి యానిమేషన్‌లుగా సక్సెస్ అయిన సిండ్రెల్లా, ద జంగల్ బుక్, బ్యూటీ అండ్ ద బీస్ట్‌లు 3డీలోనూ ఆకట్టుకోగా అదే బాటలో ద లయన్ కింగ్ కూడా విజయం సాధిస్తుందన్ననమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా 2019 జూలై 19న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment