
‘నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది.. నీలాగే ఉండే చిట్టి సింహాల కథ’ అంటూ మొదలవుతుంది ‘ముఫాసా: ద లయన్ కింగ్’ సినిమా తెలుగు ట్రైలర్. 2019లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘లయన్ కింగ్’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ద లయన్ కింగ్’ రానుంది. ఆస్కార్ అవార్డు విజేత బారీ జెంకిన్స్ దర్శకత్వం వహించారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్, పాస్టెల్ ప్రోడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 20న ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
కాగా ఈ సినిమాలో హీరోగా కనిపించే ముఫాసాకు హీరో మహేశ్‌బాబు తెలుగు వాయిస్ ఓవర్ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశారు మహేశ్‌బాబు. ‘అప్పుడప్పుడు ఈ చల్లగాలి నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలన్నీ గుర్తుచేస్తున్నట్లు అనిపిస్తుంది’, ‘అంతలోనే మాయం అవుతుంది’, ‘మనం ఒక్కటిగా పోరాడాలి’ అంటూ మహేశ్ బాబు వాయిస్‌తో చెప్పే డైలాగ్స్ ట్రైలర్‌లో ఉన్నాయి. అలాగే ‘బయటి వాడు ఎప్పుడూ పగవాడే.. దూరం పెట్టాలి. ఠాకేనే మనకు కాబోయే రాజు’ వంటి డైలాగులు కూడా ట్రైలర్‌లో వినిపిస్తాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని పుంబా పాత్రకు బ్రహ్మానందం, టిమోన్ పాత్రకు అలీ వాయిస్ ఓవర్లు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment