Telugu Trailer
-
'ఒకడి అత్యాశే ఊరిని మొత్తం నాశనం చేసింది'.. ఆసక్తిగా ట్రైలర్
జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం కింగ్స్టన్. ఈ సినిమాకు కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించారు. ఈ సీ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, పారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై జీవీ ప్రకాష్ కుమార్, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తీసుకొస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 7న సినిమా థియేటర్లలోకి రానుంది. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే సముద్ర తీర గ్రామం చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ మార్చి 7న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమోన్ అబ్దుసమద్, ఆంటోని, అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచంద్రన్ కీలక పాత్రలు పోషించారు. -
మనం ఒకటిగా పోరాడాలి!
‘నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది.. నీలాగే ఉండే చిట్టి సింహాల కథ’ అంటూ మొదలవుతుంది ‘ముఫాసా: ద లయన్ కింగ్’ సినిమా తెలుగు ట్రైలర్. 2019లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘లయన్ కింగ్’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ద లయన్ కింగ్’ రానుంది. ఆస్కార్ అవార్డు విజేత బారీ జెంకిన్స్ దర్శకత్వం వహించారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్, పాస్టెల్ ప్రోడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 20న ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలో హీరోగా కనిపించే ముఫాసాకు హీరో మహేశ్‌బాబు తెలుగు వాయిస్ ఓవర్ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశారు మహేశ్‌బాబు. ‘అప్పుడప్పుడు ఈ చల్లగాలి నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలన్నీ గుర్తుచేస్తున్నట్లు అనిపిస్తుంది’, ‘అంతలోనే మాయం అవుతుంది’, ‘మనం ఒక్కటిగా పోరాడాలి’ అంటూ మహేశ్ బాబు వాయిస్‌తో చెప్పే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. అలాగే ‘బయటి వాడు ఎప్పుడూ పగవాడే.. దూరం పెట్టాలి. ఠాకేనే మనకు కాబోయే రాజు’ వంటి డైలాగులు కూడా ట్రైలర్లో వినిపిస్తాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని పుంబా పాత్రకు బ్రహ్మానందం, టిమోన్ పాత్రకు అలీ వాయిస్ ఓవర్లు ఇచ్చారు. -
నువ్వు మొదలుపెట్టావ్.. నేను ముగిస్తాను!
‘దేశంలోని శాంతికి, దేశంలోని శత్రువులకు మధ్య ఎంత దూరం ఉంటుంది. కేవలం ఒక మనిషంత’ అంటూ మొదలువుతుంది ‘టైగర్ 3’ తెలుగు ట్రైలర్. సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్, ఇమ్రాన్ హాష్మి ప్రధాన పాత్రధారులుగా మనీష్శర్మ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించిన స్పై ఫిల్మ్ ‘టైగర్ 3’. యశ్‌రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లోని ‘టైగర్ జిందా హై’, ‘వార్’, ‘పఠాన్’ చిత్రాల్లోని ఘటనలకు కొనసాగింపుగా ‘టైగర్ 3’ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. తాజాగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘టైగర్ 3’ ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను నవంబరు 12న విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ వెల్లడించింది. ‘టపాసులు కాల్చడం నవ్వు మొదలు పెట్టావ్.. నేను ముగిస్తాను’, ‘టైగర్‌కు శ్వాస ఉన్నంత వరకు, ఈ టైగర్ ఓటమిని ఒప్పుకోడు’ అంటూ సల్మాన్‌ఖాన్ చెప్పే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘ఏక్తా టైగర్’, ‘టైగర్ జిందాహై’ చిత్రాల తర్వాత ‘టైగర్’ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమా ‘టైగర్ 3’. -
నాటు నాటుకు డ్యాన్స్ చేశా!
షారుక్ ఖాన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ హిందీ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. కాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు హీరో రామ్‌చరణ్. ఈ సందర్భంగా ట్విట్టర్లో తనదైన స్టైల్లో రామ్‌చరణ్‌కి కృతజ్ఞతలు చెప్పారు షారుక్ ఖాన్. ‘‘థ్యాంక్యూ సో మచ్. నా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. మీ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చినప్పుడు దయచేసి నన్ను తాకనివ్వండి.. లవ్యూ’’ అని ట్వీట్ చేశారు షారుక్. ‘‘తప్పకుండా ఎస్ఆర్కే సార్. ఈ అవార్డు ఇండియన్ సినిమాకు చెందింది’’ అని పోస్ట్ చేశారు చరణ్. కాగా ‘నాటు నాటు..’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించడం పట్ల షారుక్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. ఉదయం వార్త తెలిసిన వెంటనే ‘నాటు నాటు..’ పాటకు డ్యాన్స్ చేశానని ట్విట్టర్లో వెల్లడించారు. భారత్‌ను గర్వపడేలా చేశారని ప్రశంసించారు. -
ఉత్తరం రాస్తే కశ్మీర్‌ను మంచుకు వదిలేస్తారా ?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతా రామం'. సుమంత్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైజయంతీ సమర్పణలో అశ్వినీదత్ నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 20 ఏళ్ల క్రితం లెఫ్టినెంట్ రామ్ నాకొక బాధ్యతను అప్పగించాడు. ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. రామ్ రాసిన ప్రేమ లేఖను సీతామహాలక్ష్మికి చేర్చేందుకు రష్మిక మందన్నా ప్రయత్నిస్తుంటుంది. ఆ లెటర్‌ను రామ్‌కు చేర్చే క్రమంలో అతనికి ఏమైందో తెలుసుకోవడమే సినిమా కథగా తెలుస్తోంది. పాత్రల నటన, డైలాగ్స్ చాలా ఆకట్టుకున్నాయి. 'నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కశ్మీర్‌ను మంచుకు వదిలేసి వస్తారా?', 'నా పాటికి నేను అనాథలా బతికేస్తుంటే ఉత్తరాలు రాసి ఇబ్బంది పెట్టింది కాకుండా దారి ఖర్చులు ఇస్తాననడం న్యాయమా' అంటూ చెప్పే సంభాషణలు బాగున్నాయి. 1965 నాటి కాలంలో సాగే కథతో తెరకెక్కిన ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఆకట్టుుకునేలా ఉంది. చదవండి: లెక్క తప్పిన జాన్వీ కపూర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు ఆ విషయంలో తెలుగు దర్శకులకు చిరు చురకలు.. కన్నీరు పెట్టుకున్న మంచు లక్ష్మి.. ఏదో తెలియని బాధ అంటూ వీడియో -
అప్పుడెందుకు గుర్తుకు రాలేదు.. చిరుపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు
‘‘అమిర్ ఖాన్ చేసే ప్రయోగాత్మక పాత్రలను నేను చేయలేను. నా సినిమాలు జనరంజకంగా, జనామోదంగా ఉండాలని ప్రయత్నిస్తుంటాను. నా ప్రమేయం లేకుండా కొన్ని సినిమాలు జరిగిపోతుంటాయి. ఆమిర్ ఖాన్ ‘లాల్‌సింగ్ చడ్డా’ను నేను సమర్పిస్తున్నందుకు గర్వపడుతున్నాను. అలాంటి కంటెంట్, ఎమోషన్ సినిమాలో ఉంది. కన్నీళ్లు పెట్టుకోం కానీ సినిమా చూస్తున్నప్పుడు చాలా చోట్ల కంటతడి, గుండె తడి ఉంటూనే ఉంటుంది’’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అమిర్ ఖాన్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘లాల్‌సింగ్ చడ్డా’. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకుడు. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్ర చేశారు. ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. ఆదివారం (జులై 24) హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో ‘లాల్‌సింగ్ చడ్డా’ తెలుగు ట్రైలర్‌ను చిరంజీవి, ఆమిర్ ఖాన్ రిలీజ్ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘2019లో జపాన్ ఎయిర్‌పోర్ట్‌లో నేను, అమిర్ కలిశాం. అప్పుడు ‘ఫారెస్ట్ గంప్’ను రీమేక్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ రీమేక్ ఆమిర్‌కు అవసరమా? అనే ఫీలింగ్ వచ్చింది కానీ ఆయన ప్యాషన్ చూసి కరెక్ట్ అనిపించింది. మనకు టామ్ హాంక్స్ (‘ఫారెస్ట్‌గంప్’లో హీరోగా నటించిన హాలీవుడ్ నటుడు) అంటే ఎవరో కాదు.. ఆమిర్ ఖాన్నే. ‘3 ఇడియట్స్’, ‘లగాన్’, ‘పీకే’ ‘దంగల్’.. ఇలా డిఫరెంట్ చిత్రాలు చేశారు ఆమిర్. ఇంత తపన ఉన్న నటుడు ఇండియాలో ఒక్క ఆమిర్ ఖానే ఉన్నారు. సినిమా మేకింగ్‌లో కర్త, కర్మ తానే అవుతారు. ఇలాంటి యూనిక్ స్టైల్ ఇండియాలో ఏ యాక్టర్లోనూ లేదు. మేం కూడా చేయాలనుకుంటాము. కానీ పరిమితులు ఉంటాయి. సో.. ఆయనలా మేం చేయలేం. అందుకే ఆయన అడగ్గానే ఆబ్లిగేషన్‌తో కాదు.. ఎంతో హానర్‌గా ‘లాల్‌సింగ్ చడ్డా’ని సమర్పించడానికి ఒప్పుకున్నాను’’ అన్నారు. అమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘లాల్‌సింగ్ చడ్డా’ చూసి, నచ్చితే సమర్పించమని చిరంజీవిగారిని కోరాను. ఇప్పటివరకు ఏ సినిమాకూ ఆయన సమర్పకులుగా లేరని నాకు తెలుసు. మా సినిమాకు సమర్పకులుగా ఉన్నందుకు ఆయనకు ధన్యవాదాలు. నాగచైతన్య క్రమశిక్షణ చూసి, తనను బాగా పెంచారని చైతన్య అమ్మ లక్ష్మీగారికి ఫోన్ చేసి, మాట్లాడాను. ఈ సినిమాను మా అమ్మగారు చూశారు. ‘ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు’ అన్నారామె. నా కూతురు ఐరా ఎమోషనల్ పర్సన్. ఈ సినిమాను తను ఇంకా చూడలేదు ’’ అని తెలిపారు. నాగచైతన్య మాట్లాడుతూ .. ‘‘ఈ చిత్రంలో గుంటూరుకు చెందిన బాలరాజు పాత్ర చేశాను. ఈ సినిమా కోసం వర్క్‌షాప్స్ చేశాం. ఇలా చేయడం నాకు కొత్త. ఈ సినిమాలో నా పాత్ర దాదాపు 30 నిమిషాలు ఉంటుంది. కొన్ని సినిమాల్లో పాత్ర ఎంతసేపు ఉందని కాదు.. కొన్ని మూమెంట్స్‌ను, ఎక్స్‌పీరియన్స్‌ను నేర్పిస్తాయి. యాక్టర్‌గా ఈ సినిమా నాకో ఇన్వెస్ట్మెంట్. ఆర్టిస్టుగా హెల్ప్ అవుతుందని ఈ సినిమా చేశాను’’ అని పేర్కొన్నారు. చిరంజీవి: ఒకప్పుడు భారతీయ సినిమా అంటే హిందీ సినిమా అన్నట్లుగా చూపించారు. తెలుగు యాక్టర్‌గా కాదు... నేను ఇండియన్ యాక్టర్ అనిపించుకోవాలని హిందీలో ‘ప్రతిబంధ్, ఆజ్ కా గూండా రాజ్, జెంటిల్మెన్’ సినిమాలు చేశాను. కమల్‌హాసన్ ‘ఏక్ దూజే కే లియే’ వంటివి చేశారు. అయినా సౌత్ యాక్టర్స్‌గానే చూశారు. విశ్వనాథ్‌గారి ‘శంకరాభరణం’ నుంచి తెలుగు సినిమాకు గుర్తింపు వచ్చినా.. తర్వాత అలాంటి గుర్తుంపు వచ్చింది లేదు. రాజమౌళి ఆ హద్దులు చెరిపేశారు. సౌత్, నార్త్ అనే తేడాలు పోయాయి. ఏ భాషలో తీసినా సరే అది ఇండియన్ సినిమాయే. ఇలాంటి వాతావరణం రావాలని తపన పడ్డాను. అమిర్ ఖాన్: చిరంజీవిగారు బాధపడ్డ ఆ సందర్భం గురించి నేను చదివాను. ఓ హిందీ యాక్టర్ అయిన నేను ఇప్పుడు ఆయన హెల్ప్ కోసం ఇక్కడికి వచ్చాను. దక్షిణాది సినిమాలు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్’లకు మంచి ఆదరణ లభించింది. నాకు తెలుగు సినిమా చేయాలని ఉంది. చిరంజీవిగారికి ఓసారి ఫోన్ చేసినప్పుడు సల్మాన్ తన సినిమాలో నటిస్తున్నట్లుగా చెప్పారు. నేను ఎందుకు గుర్తు రాలేదని ఆయనతో అన్నాను. -
నేను తొందరపడలేదు.. గర్వపడి చేస్తున్నా: చిరంజీవి
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ లాంచ్ ఆదివారం (జులై 24) గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్లో 'లాల్‌సింగ్ చద్దా' తెలుగు ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితోపాటు అమీర్ ఖాన్, నాగ చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ అమీర్ ఖాన్ భారతీయ సినిమాకు ఒక ఖజానా. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో గొప్ప నటుడు అనిపించుకున్నాడు. అమీర్ ఖాన్ నడక, నడవడిక అంటే నాకు చాలా ఇష్టం. అమీర్ ఖాన్‌లాగా మేం చేయాలనుకుంటాం. కానీ మాకున్న పరిధుల వల్ల చేయలేకపోతున్నాం. చదవండి: కేటీఆర్ గారూ.. త్వరగా కోలుకోవాలంటే ఈ చిత్రం చూడండి.. నూలుపోగు లేకుండా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు అమీర్ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆయనపై ఉన్న ప్రేమ, బాధ్యతతో ఈ సినిమాకు సమర్పకుడిగా ఉన్నా. నేను తొందరపడి ఈ సినిమా ఒప్పుకోలేదు. గర్వపడి విడుదల చేస్తున్నా అని చిరంజీవి తెలిపారు. ఈ ఈవెంట్లో అమీర్ ఖాన్‌తో నాగ చైతన్య తెలుగు డైలాగ్ చెప్పించి అలరించాడు. అలాగే చిరంజీవికి అమీర్ ఖాన్ పానీపూరి తినిపించాడు. చదవండి: శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ -
క్రిష్ అందుకే తప్పుకున్నారు : కంగనా
చిన్నప్పుడు తమ్ముడికి ఆడుకునే గన్ను తనకు బొమ్మ కొనిచ్చినప్పుడు ‘నేనెందుకు గన్నుతో ఆడుకోకూడదు. ఎందుకీ వివక్ష’.. ప్రశ్నించింది కంగనా రనౌత్. స్త్రీ ఎందులోనూ తక్కువ కాదని చిన్ని మనసులో నాటుకుపోయింది. పెరిగే కొద్దీ ఆ భావన పెరిగి పెద్దదైంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎలాంటి బ్యాగ్రౌండూ లేకుండా బాలీవుడ్‌కి వచ్చి స్టార్ అయింది. ‘తను వెడ్స్ మను, రజ్జో, క్వీన్’ చిత్రాలతో తానేంటో నిరూపించుకుంది. ఇప్పుడు ‘మణికర్ణిక: ఝాన్సీ రాణి’గా రాబోతోంది. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసిన సందర్భంగా కంగనా ఇంటర్వ్యూ.. ► స్క్రిప్ట్ దశ నుంచి షూటింగ్లో, ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అయిన నేపథ్యంలో సాగిన ‘మణికర్ణిక’ ప్రయాణం మీకెలా అనిపించింది? చాలా దశలు చూశాను. విజయేంద్రప్రసాద్గారైతే ఆ ఝాన్సీ లక్ష్మీబాయ్ ఎన్నో పరీక్షలు ఎదుర్కొంది. ఇప్పుడు ఈ సినిమా కూడా నిన్ను చాలా పరీక్షలు పెడుతోందన్నారు. అది నిజమే. ఈ చిత్రం షూటింగ్లో గాయపడ్డాను. ఆ తర్వాత అనుకోకుండా డైరెక్టర్‌గా మారాల్సి వచ్చింది. సినిమాల్లో యుద్ధ సన్నివేశాలు చాలా ఉన్నాయి. ప్రతి పరీక్షను దాటుకుంటూ వచ్చాను. ► కథ విన్నాక ఈ సినిమా కోసం మీరు ఏమేం నేర్చుకున్నారు? కత్తి సాము నేర్చుకున్నాను. ఒకే కరవాలంతో కాదు.. కొన్ని సన్నివేశాల్లో రెండు కత్తులు దూస్తాను. దానికోసం చాలా ప్రాక్టీస్ చేశాను. కత్తిసాము, గురప్రు స్వారీలో పర్ఫెక్షన్ తీసుకురావడానికి రెండు నెలలు కష్టపడ్డాను. ఝాన్సీ లక్ష్మీ బాయ్ శక్తివంతమైన స్త్రీ. నేను కూడా చూడ్డానికి అంతే పవర్‌ఫుల్‌గా కనిపించాలి. అందుకు తగ్గట్టుగా నా బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాను. ‘బాహుబలి’ తర్వాత వస్తున్న మంచి పీరియాడికల్ మూవీ ‘మణికర్ణిక’. ఫస్ట్ ఉమెన్ యాక్షన్ మూవీ. అందుకే రాజీపడలేదు. ► లక్ష్మీ బాయ్ వీర వనిత. బ్యాగ్రౌండ్ లేని స్థాయి నుంచి స్టార్‌గా ఎదిగే క్రమంలో మీరు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మహిళలందరూ ధైర్యంగా ఉండాలి కదా? కచ్చితంగా ఉండాలి. రాణీ లక్ష్మీ బాయ్‌లాంటి వాళ్లను సమాజం తయారు చేయడానికి ముందుకొస్తే కాదనేవారు ఎవరుంటారు? అయితే నువ్వు ధైర్యంగా ఉండాలి అని ఎవర్నీ ఒత్తిడి చేయకూడదు. ధైర్యవంతులను నిరుత్సాహపరచకూడదు. ► ఓకే.. ‘మణికర్ణిక’ని పూర్తి చేయడానికి డైరెక్షన్ సీట్లోకి రావాలన్నది మీ ఆలోచనా? అసలు ఏం జరిగింది? క్రిష్‌గారు ఓ తెలుగు సినిమా ఒప్పుకోవడం వల్ల ‘మణికర్ణిక’ వాయిదా పడే పరిస్థితి వచ్చింది. మేం ఎలాగైనా జనవరిలోనే విడుదల చేయాలనుకున్నాం. దాంతో నిర్మాత కమల్ జైన్, రచయిత విజయేంద్రప్రసాద్‌గారు నన్నే డైరెక్షన్ చేయమన్నారు. అయితే ఇది ఈజీ మూవీ కాదు. ఒక చరిత్ర. అందుకే వేరే ఇద్దరు డైరెక్టర్లు పెట్టమన్నాను. అలా చేసినా సింక్ అవ్వలేదు. ఫైనల్లీ నేనే చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే అప్పటికే క్రిష్ చేసి ఉండటంతో మిగతా నాకు కొంచెం సులువు అయింది. ► క్రిష్ అలా తప్పుకోవడం కరెక్టేనంటారా? పైగా ‘మణికర్ణిక’ గురించి ఆయన ఎక్కడా మాట్లాడటంలేదు కూడా? ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు కాబట్టే తప్పుకున్నారు. వాయిదా వేయడానికి ఇష్టం లేక మేం పూర్తి చేశాం. ఇక ఈ సినిమా గురించి ఆయన ఎందుకు మాట్లాడటంలేదు అంటే.. ఆయన చేస్తున్న ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టి ఉంటారు. ► మీరు దర్శకత్వ బాధ్యతలు చేపట్టడంవల్లే.. ఒక లేడీ డైరెక్టర్‌తో చేయడంతో ఇష్టం లేక సోనూ సూద్ తప్పుకున్నారట. కానీ ఆయనేమో గెటప్‌లో వచ్చిన మార్పు వల్లే అంటున్నారు? గెటప్ మారినది నిజమే. సోనూ సూద్ ‘సింబా’ సినిమా ఒప్పుకున్నారు. ఆ సినిమా గెటప్‌కీ, దీనికీ సింక్ అవ్వదు. ఇందులో గడ్డం ఉండాలి. కానీ గడ్డం పెంచలేనంటూ తప్పుకున్నారు. అయినా ఇవాళా రేపూ గడ్డం గెటప్ అంటే పెంచాల్సిన అవసరమే లేదు. కావాలంటే పెట్టుడు గడ్డంతో మ్యానేజ్ చేయొచ్చు. కానీ సోనూ సూద్ తప్పుకున్నారు. అయినా ఓకే. ► మరో సినిమాకి దర్శకత్వం వహించాలని అనుకుంటున్నారట? అవును. ఆ సినిమాకి విజయేంద్రప్రసాద్‌గారే కథ అందిస్తున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఇది ఏలియన్స్‌కి సంబంధించిన కథ కాదు. -
ధోనీ ట్రైలర్ రిలీజ్ చేసిన నాని
-
ధోనీ ట్రైలర్ రిలీజ్ చేసిన నాని
సాధారణ రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయినుంచి దేశం గర్వించదగిన క్రికెటర్‌గా ఎదిగిన ఎంఎస్ ధోనీ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని 'ఎంఎస్ ధోని- ది అన్‌టోల్డ్ స్టోరీ' పేరుతో హిందీలో తెరకెక్కించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ యువహీరో సుశాంత్ రాజ్‌పూత్ ధోని పాత్రలో నటించారు. అయితే ముందుగా ఈ సినిమాను హిందీలో మాత్రమే రిలీజ్ చేయాలనుకున్న చిత్ర యూనిట్.. ధోనీకున్న క్రేజ్, ట్రైలర్‌కి వచ్చిన విశేష స్పందన చూసిన తరువాత తెలుగు, తమిళ భాషల్లోకి కూడా డబ్ చేయాలని నిశ్చయించింది. తమిళంలో ఇప్పటికే ట్రైలర్ విడుదల కాగా, తెలుగు ట్రైలర్‌ను హీరో నాని ట్విట్టర్ ద్వారా బుధవారం సాయంత్రం విడుదల చేశారు. తెలుగు వర్షన్ ట్రైలర్ తాను విడుదల చేస్తున్నందుకు నాని హర్షం వ్యక్తంచేశారు. సెల్యూట్ టు ఎమ్మెస్ ధోనీ అంటూ ట్వీట్ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 30న ఈ చిత్రం భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన భూమిక ఈ సినిమాలో ధోనీ సోదరి పాత్రలో కనిపించనున్నారు. Privileged to present to you the Telugu version of #MSDhoniTrailer. Salute to @msdhoni #CaptainCool https://t.co/WhRJ7hk2pD — Nani (@NameisNani) 17 August 2016