
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ లాంచ్ ఆదివారం (జులై 24) గ్రాండ్‌గా జరిగింది.
ఈ ఈవెంట్‌లో 'లాల్‌సింగ్ చద్దా' తెలుగు ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితోపాటు అమీర్ ఖాన్, నాగ చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ అమీర్ ఖాన్ భారతీయ సినిమాకు ఒక ఖజానా. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో గొప్ప నటుడు అనిపించుకున్నాడు. అమీర్ ఖాన్ నడక, నడవడిక అంటే నాకు చాలా ఇష్టం. అమీర్ ఖాన్‌లాగా మేం చేయాలనుకుంటాం. కానీ మాకున్న పరిధుల వల్ల చేయలేకపోతున్నాం.
చదవండి: కేటీఆర్ గారూ.. త్వరగా కోలుకోవాలంటే ఈ చిత్రం చూడండి..
నూలుపోగు లేకుండా రణ్‌వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు
అమీర్ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆయనపై ఉన్న ప్రేమ, బాధ్యతతో ఈ సినిమాకు సమర్పకుడిగా ఉన్నా. నేను తొందరపడి ఈ సినిమా ఒప్పుకోలేదు. గర్వపడి విడుదల చేస్తున్నా అని చిరంజీవి తెలిపారు. ఈ ఈవెంట్‌లో అమీర్ ఖాన్‌తో నాగ చైతన్య తెలుగు డైలాగ్ చెప్పించి అలరించాడు. అలాగే చిరంజీవికి అమీర్ ఖాన్ పానీపూరి తినిపించాడు.
చదవండి: శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ
Comments
Please login to add a commentAdd a comment