నువ్వు మొదలుపెట్టావ్‌.. నేను ముగిస్తాను! | Tiger 3 Telugu Trailer Launch | Sakshi

నువ్వు మొదలుపెట్టావ్‌.. నేను ముగిస్తాను!

Oct 17 2023 3:53 AM | Updated on Oct 17 2023 3:53 AM

Tiger 3 Telugu Trailer Launch - Sakshi

‘దేశంలోని శాంతికి, దేశంలోని శత్రువులకు మధ్య ఎంత దూరం ఉంటుంది. కేవలం ఒక మనిషంత’ అంటూ మొదలువుతుంది ‘టైగర్‌ 3’ తెలుగు ట్రైలర్‌. సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్, ఇమ్రాన్‌ హాష్మి ప్రధాన పాత్రధారులుగా మనీష్‌శర్మ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించిన స్పై ఫిల్మ్‌ ‘టైగర్‌ 3’. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ స్పై యూనివర్స్‌లోని ‘టైగర్‌ జిందా హై’, ‘వార్‌’, ‘పఠాన్‌’ చిత్రాల్లోని ఘటనలకు కొనసాగింపుగా ‘టైగర్‌ 3’ ఉంటుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది.

తాజాగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘టైగర్‌ 3’ ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను నవంబరు 12న విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్‌ వెల్లడించింది. ‘టపాసులు కాల్చడం నవ్వు మొదలు పెట్టావ్‌.. నేను ముగిస్తాను’, ‘టైగర్‌కు శ్వాస ఉన్నంత వరకు, ఈ టైగర్‌ ఓటమిని ఒప్పుకోడు’ అంటూ సల్మాన్‌ఖాన్‌ చెప్పే డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి. ‘ఏక్తా టైగర్‌’, ‘టైగర్‌ జిందాహై’ చిత్రాల తర్వాత ‘టైగర్‌’ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమా ‘టైగర్‌ 3’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement