సాధారణ రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయినుంచి దేశం గర్వించదగిన క్రికెటర్గా ఎదిగిన ఎంఎస్ ధోనీ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని 'ఎంఎస్ ధోని- ది అన్‌టోల్డ్ స్టోరీ' పేరుతో హిందీలో తెరకెక్కించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ యువహీరో సుశాంత్ రాజ్పూత్ ధోని పాత్రలో నటించారు. అయితే ముందుగా ఈ సినిమాను హిందీలో మాత్రమే రిలీజ్ చేయాలనుకున్న చిత్ర యూనిట్.. ధోనీకున్న క్రేజ్, ట్రైలర్కి వచ్చిన విశేష స్పందన చూసిన తరువాత తెలుగు, తమిళ భాషల్లోకి కూడా డబ్ చేయాలని నిశ్చయించింది.
తమిళంలో ఇప్పటికే ట్రైలర్ విడుదల కాగా, తెలుగు ట్రైలర్ను హీరో నాని ట్విట్టర్ ద్వారా బుధవారం సాయంత్రం విడుదల చేశారు. తెలుగు వర్షన్ ట్రైలర్ తాను విడుదల చేస్తున్నందుకు నాని హర్షం వ్యక్తంచేశారు. సెల్యూట్ టు ఎమ్మెస్ ధోనీ అంటూ ట్వీట్ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 30న ఈ చిత్రం భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన భూమిక ఈ సినిమాలో ధోనీ సోదరి పాత్రలో కనిపించనున్నారు.
Privileged to present to you the Telugu version of #MSDhoniTrailer. Salute to @msdhoni #CaptainCool https://t.co/WhRJ7hk2pD
— Nani (@NameisNani) 17 August 2016