
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం అయిన ట్విట్టర్ టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్లుగా గుర్తించింది. ట్విటర్‌లో వీరి పేర్ల హ్యాష్‌ట్యాగ్స్‌కు GOAT (Great Of All Time) ఏమోజీ జోడించి గౌరవించింది. వీరితో పాటు టీమిండియా మాజీ సారధి ఎంస్ ధోని, టెన్నిస్ దిగ్గజం రఫెల్ నదాల్‌లను కూడా దిగ్గజ క్రీడాకారులుగా గుర్తించింది. ఇకపై ట్విటర్‌లో కోహ్లి, రోహిత్, ధోని, నదాల్ పేర్ల హ్యాష్‌ట్యాగ్స్ GOAT ఏమోజీతో దర్శనమిస్తాయి.
కాగా, ఈ టీమిండియా ప్రస్తుత, మాజీ కెప్టెన్లు క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణించి దిగ్గజ క్రికెటర్లుగా ఇదివరకే గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు క్రికెటర్లు ఆటతీరుతో పాటు కెప్టెన్సీ నైపుణ్యంతోనూ విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. మరోవైపు, స్పెయిన్ బుల్ రఫెల్ నదాల్ ప్రస్తుత తరం టెన్నిస్‌లో తిరుగులేని ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 టైటిల్ గెలిచి, టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ (21) టైటిల్ విన్నర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్సీ వదులుకోవడానికి అసలు కారణమిదే: కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment