యంగ్ ముఫాసా వచ్చేస్తున్నాడు.. ట్రైలర్ చూశారా? | Disney prequel Mufasa The Lion King trailer Out Now | Sakshi
Sakshi News home page

The Lion King: 'ది లయన్‌ కింగ్' మళ్లీ వచ్చేస్తున్నాడు.. ట్రైలర్ చూశారా?

Published Mon, Apr 29 2024 8:54 PM | Last Updated on Mon, Apr 29 2024 8:54 PM

Disney prequel Mufasa The Lion King trailer Out Now

చిన్నా, పెద్దా అనే తేడా అందరినీ ‍అలరించిన చిత్రం లయన్‌ కింగ్‌. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే లయన్ కింగ్‌-2 కూడా వచ్చింది. తాజాగా లయన్‌ ప్రీక్వెల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మేకర్స్.

అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ లయన్‌ కింగ్‌ ప్రీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. 1994లో వచ్చిన ది లయన్‌ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. 2019లో జోన్ ఫావ్‌రూ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

తాజాగా ముఫాసా ది లయన్ కింగ్ ప్రీక్వెల్‌కు సంబంధించి ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిన పెంచేస్తున్నాయి. ముఫాసా చిన్నప్పటి కథను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ చిత్రంలో రఫీకిగా జాన్ కనీ, పుంబాగా సేథ్ రోజెన్, టిమోన్‌గా బిల్లీ ఐచ్నర్, సింబాగా డోనాల్డ్ గ్లోవర్, నాలాగా బియాన్స్ నోలెస్-కార్టర్ కనిపించనున్నారు. కాగా.. ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement