ది లయన్‌ కింగ్‌.. మహేశ్‌బాబు వచ్చేస్తున్నాడు.. తెలుగు ట్రైలర్‌ చూశారా! | Mufasa The Lion King In Telugu And Having Been A Massive Fan Tailer Out Now, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Mufasa The Lion King Trailer: ముఫాసాగా అలరించనున్న మహేశ్‌బాబు.. తెలుగు ట్రైలర్ చూశారా?

Published Mon, Aug 26 2024 11:27 AM | Last Updated on Mon, Aug 26 2024 12:27 PM

Mufasa in Telugu and having been a massive fan Tailer Out Now

చిన్నా, పెద్దా అనే తేడా అందరినీ ‍అలరించిన చిత్రం ది లయన్‌ కింగ్‌. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే లయన్ కింగ్‌-2 కూడా వచ్చింది. తాజాగా లయన్‌ ప్రీక్వెల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మేకర్స్.

తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ముఫాసా పాత్రలో మహేశ్ ‍బాబు వాయిస్‌తో అభిమానులను అలరించనున్నారు. గతంలో లాగే బ్రహ్మనందం, అలీ వాయిస్‌ పాత్రలతో టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ను మరోసారి మెప్పించనున్నారు. అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ లయన్‌ కింగ్‌ ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. 1994లో వచ్చిన ది లయన్‌ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. కాగా.. ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement