
ఆస్కార్ శతాబ్ది ఉత్సవాల (ఆస్కార్ అవార్డుల వందో వేడుక) సన్నాహాలు మొదలయ్యాయి. 2028లో జరగనున్న ఈ వేడుకల కోసం ఆస్కార్ నిర్వాహకులు ఇప్పట్నుంచే ప్రణాళికలు వేస్తుండటం హాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ‘ఆస్కార్ 100’ పేరిట ఈ వేడుకలు జరగనున్నట్లుగా రోమ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆస్కార్ ప్రతినిధులు వెల్లడించారు. ‘‘ఆస్కార్ 100’ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నాం.
ఇందుకోసం 500 మిలియన్ డాలర్ల క్యాంపైన్ (దాదాపు రూ. నాలుగు వేల కోట్లు)ను లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ఏడాదిన్నరలో ఇప్పటికే ‘ఆస్కార్ 100’ కోసం వంద మిలియన్ డాలర్లను సేకరించాం. ‘ఆస్కార్ 100’ ఈవెంట్‌ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ వేడుకల సందర్భంలోనే మరో వంద సంత్సరాల పాటు ఆస్కార్ అవార్డు వేడుకలను ఎలా నిర్వహించాలనే విషయాలను చర్చించుకుని, ఓ అవగాహనకు రావాలనుకుంటున్నాం’’ అని ఆస్కార్ కమిటీ ప్రస్తుత సీఈవో బిల్ క్రామోర్ చెప్పుకొచ్చారు. ఇక 97వ ఆస్కార్ అవార్డుల వేడుకలు వచ్చే ఏడాది మార్చి 2న జరగనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment