
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు’ తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా నటించనున్న మూడో సినిమా ఖరారయింది. కల్యాణ్ శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్న ఈ చిత్రాన్ని బుధవారం ప్రకటించారు. ‘‘
తెలుగు సినిమా శ్రీకారం చుట్టుకున్న రోజున (1931, సెప్టెంబర్ 15) ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థ పురుడు పోసుకోవడం హ్యాపీగా ఉంది. మీరు (ప్రేక్షకులు) మరింత సరదాగా నవ్వుకోవడానికి సిద్ధంగా ఉండండి. మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: పీడీవీ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment