పెద్ద హీరోలు కాదు, అగ్ర దర్శకుడు లేడు అయినా ఆ సినిమాకు ప్రేక్షకులు జైకొట్టారు. థియేటర్లలో పడిపడి నవ్వి.. నిర్మాతలపై కాసుల వర్షం కురిపించారు. ఇప్పటికే అది ‘జాతిరత్నాలు’సినిమా అని అర్థమైపోయిందనుకుంట. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ‘జాతిరత్నాలు’నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల అమాకత్వపు పనులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇక ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా ప్రేక్షకుల మనసును దోచుకుంది. ‘చిట్టి’ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టికి ఎంత క్రేజ్ వచ్చిందో.. ఫరియాకు అంతే వచ్చింది.
‘జాతిరత్నాలు’తర్వాత ఈ పొడగరి బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. మాస్ మహారాజా రవితేజ సినిమాలో కూడా ఫరియాకు చాన్స్ వచ్చినట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇంతవరకు అధికార ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి రెండు భారీ నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్ వచ్చిందట. కానీ ఈ ఆఫర్లను ఫరియా సున్నితంగా తిరస్కరించిందట. అందుకు కారణం ఆమె ఎత్తు అనే తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో అత్యంత పొడగరి ఫరియానే. ప్రభాస్, రానా, గోపిచంద్, వరుణ్‌తేజ్ మినహా మరే హీరోలు ఆమె హైట్‌కు సెట్ కాలేరు. తాజాగా ఆమెకు వచ్చిన ఆఫర్లలో హీరోల హైట్ ఆమెకంటే చాలా తక్కువట. అందుకే ఆ సినిమాలను ఫరియా సున్నితంగా తిరస్కరించిందట. తనకంటే తక్కువ హైట్ ఉన్నహీరోలతో నటించేందుకు ఫరియా మొగ్గు చూపడంలేదని తెలుస్తోంది. మరోవైపు ఫరియా బాలీవుడ్ చాన్స్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు మూడు కథలు కూడా విన్నట్లు వార‍్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment