
Naveen Polishetty Hosting To Radhe Shyam Pre Release Event: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానుల మోస్ట్ అవేయిటెడ్ మూవీ 'రాధేశ్యామ్'. ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. చిత్రబృందం చేస్తున్న సినిమా ప్రమోషన్స్ కూడా భారీ హైప్‌కు ఒక కారణం. ఇదివరకు రిలీజ్ చేసిన టీజర్, పాటలు పలు రికార్డులు నమోదు చేశాయి. ఇటీవలే పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటిస్తున‍్నట్లు వెల్లడించిన పోస్టర్‌కు విశేష స్పందన లభించింది. ఇక ప్యారిస్ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో ప్రేరణగా కనిపించనున్న పూజా హెగ్డే అదనపు ఆకర్షణ. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ చిత్రం 'గ్లాడియేటర్'కు యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన నిక్ పోవెల్ పనిచేయడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో జనవరి 14, 2022న సంక్రాంతి కానుకగా 'రాధేశ్యామ్' ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 23న హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రభాస్ అభిమానులే అతిథులుగా హాజరుకానున్నారు. ఐదు భాషలకు సంబంధించిన ట్రైలర్స్‌ను ఫ్యాన్స్ చేతులమీదుగా విడుదల చేయనున్నారు. ఈ కార్యక‍్రమం గురించి తాజాగా మరో ఆసక్తికర విషయం తెలిసింది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి వ్యవహరించనున్నాడు. ఇది తెలిసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ మరింత డబుల్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారు.
సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకు సుమ కనకాల, ప్రదీప్, అనసూయ, శ్రీముఖి వంటి ప్రముఖ యాంకర్స్ హోస్ట్‌గా వ్యవహరించేవారు. కానీ రాధేశ్యామ్ సినిమా కోసం మాత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ', 'జాతి రత్నాలు' చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నవీన్ పోలిశెట్టి యాంకర్‌గా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నవీన్‌తో పాటు యాంకర్ రష్మీ గౌతమ్ కూడా హోస్ట్‌గా వ్యవహరించనుందని సమాచారం. అయితే జాతి రత్నాలు సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: రాధేశ్యామ్ రెండో సాంగ్.. ఫ్లర్టేషన్‌షిప్ కోరుకుంటున్నాడట
Comments
Please login to add a commentAdd a comment