Radhe Shyam Pre Release Event: Rumours On Naveen Polishetty Remuneration Goes Viral - Sakshi
Sakshi News home page

రాధేశ్యామ్‌ ఈవెంట్‌ కోసం నవీన్‌ పొలిశెట్టి ఎంత తీసుకున్నాడు?

Published Wed, Dec 29 2021 8:56 AM | Last Updated on Wed, Dec 29 2021 1:20 PM

Rumours On Naveen Polishetty Remuneration For Radhe Shyam Pre Release Event - Sakshi

పాన్‌  ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘రాధేశ్యామ్‌’ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి ఓ కొత్త యాంకర్‌ వచ్చాడు. అతనెవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన జాతిరత్నం.. నవీన్‌ పొలిశెట్టి. 

టాలీవుడ్‌లో ఫీమేల్‌ యాంకర్స్‌ చాలా మంది ఉన్నారు కానీ మేల్‌ యాంకర్స్‌ చాలా తక్కువ మందే ఉన్నారు. వారిలో యాంకర్‌ రవి, ప్రదీప్‌ లాంటివారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ వాళ్లు ప్రీరిలీజ్‌ ఈవెంట్స్‌ అంతగా చేయరు . అందులోనూ పాన్‌ ఇండియా స్థాయి సినిమాలకు యాంకరింగ్‌ చేసిన అనుభవం లేదు. అయితే తాజాగా పాన్‌  ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘రాధేశ్యామ్‌’ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి ఓ కొత్త యాంకర్‌ వచ్చాడు. అతనెవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన జాతిరత్నం.. నవీన్‌ పొలిశెట్టి. 

‘జాతిరత్నాలు’మూవీతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్‌ పొలిశెట్టి.. ఉన్నట్టుండి యాంకర్‌గా మారిపోయాడు. దీంతో హోస్ట్‌గా చేయడానికి ఎంత తీసుకున్నాడు. అసలు రాధేశ్యామ్‌ ఈవెంట్‌కి నవీన్‌ను యాంకర్‌గా సూచించిందెవరు అనే విషయంలో అనేక రకాల కథనాలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే.. ప్రభాస్‌తో ఉన్న స్నేహం కారణంగానే నవీన్‌ ఈ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి హోస్ట్‌గా చేయడానికి ఒప్పకున్నాడట. అయితే అతన్ని సూచించింది మాత్రం ‘మహానటి’ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌.

నవీన్‌ కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా.. బాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. చిచోరేతో బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అందుకే అతన్ని హోస్ట్‌గా పెడితే ప్రమోషన్స్‌కి కలిసొస్తుందని ప్రభాస్‌కి చెప్పాడట నాగ్‌ అశ్విన్‌. దీంతో ప్రభాస్‌.. నవీన్‌ పొలిశెట్టి హోస్టింగ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. ‘జాతిరత్నాలు’సమయంలో ప్రభాస్‌ నవీన్‌ పొలిశెట్టికి సపోర్ట్‌ చేశాడు. ఆ మూవీ ట్రైలర్‌ విడుదల చేసి.. సినిమా స్థాయిని పెంచాడు. అందుకే నవీన్‌ పొలిశెట్టి తనవంతు సాయంగా ‘రాధేశ్యామ్‌’ ప్రీరిలీజ్‌ఈవెంట్‌కి ఎలాంటి రెమ్యునరేషన్‌ తీసుకోకుండా హోస్టింగ్‌ చేశాడట. ఇప్పటికే యూవీ క్రియేషన్స్‌లో నవీన్‌ ఓ సినిమా చేస్తున్నాడు.. అలాగే ప్రభాస్‌తోనూ మంచి బాండింగ్‌ ఉంది. అందుకే నవీన్‌ పొలిశెట్టి ఫ్రీగా యాంకరింగ్‌ చేశాడట. నిజంగానే అతని యాంకరింగ్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి ఉపయోగపడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement