‘రాధేశ్యామ్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఘటనపై స్పందించిన ప్రభాస్‌ | Prabhas Helped Fans Who Injuried In Radhe Shyam Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

Prabhas: మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్‌, గాయపడ్డ ఫ్యాన్స్‌కు ఆర్థిక సాయం!

Published Thu, Dec 30 2021 8:39 PM | Last Updated on Thu, Dec 30 2021 9:04 PM

Prabhas Helped Fans Who Injuried In Radhe Shyam Movie Pre Release Event - Sakshi

Prabhas Help His Fans Who Injured In Radhe Shyam Event: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్‌ ఇండియా మూవీ రాధే శ్యామ్‌. ఇటీవల ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ జరిగిన ఈ ప్రీరిలీజ్‌ వేడుకకు అభిమానులు భారీ సంఖ్యలో పోటేత్తారు. చాలా కాలం గ్యాప్‌ తర్వాత ప్రభాస్‌ మూవీ వస్తుండటంతో ఈ వేడుకకు ఊహించిన దానికి కంటే ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్స్‌ వచ్చారు. దాదాపు 30 వేలకు పైగా మంది ఈ వేడుకకు హజరైనట్లు తెలుస్తోంది.

చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోన్న శ్యామ్‌ సింగరాయ్‌!, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

అయితే ఈ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ప్రభాస్‌ భారీ భారీ కటౌట్స్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం జరుగుతుండగా కొంతమంది ఫ్యాన్స్‌ అత్యాత్సాహం​ చూపిస్తూ ఈ కటౌట్స్‌ ఎక్కి హంగామా చేశారు. అది చూసిన ఈవెంట్‌ నిర్వాహకులు, పోలీసులు వారిని వారించిన వినిపించుకోలేదు. ఈ క్రమంలో కొంతమంది అభిమానులు కటౌట్స్‌ నుంచి జారి కిందపడటంతో గాయాలపాలైన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్‌ ఘటనపై ప్రభాస్‌ స్పందిస్తూ గాయపడిన వారికి ఆర్థిక సాయం అందించినట్లు తెలుస్తోంది.

చదవండి: మారక తప్పదంటూ దీప్తి పోస్ట్‌, షణ్నూతో బ్రేకప్‌ తప్పదా?

ఇదివరకు కూడా ఎన్నో సార్లు కష్టాల్లో తన ఫ్యాన్స్‌ను ప్రభాస్‌ ఆదుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి గాయపడిన అభిమానులకు ఆర్థిక సాయం అందించి ఉదారత చాటుకున్నాడు ప్రభాస్‌. దీంతో ‘డార్లింగ్‌’ మంచి మనసుకు ఫిదా అవుతూ ఫ్యాన్స్‌ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ మూవీ సంక్రాంతి పండగా సందర్భంగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సద్దమవుతోంది. అయితే రాధేశ్యామ్‌తో పాటు సలార్‌, ఆదిపురుష్‌, స్పిరిట్‌, ప్రాజెక్ట్‌ కే సినిమాలతో ప్రభాస్‌ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సలార్‌, ఆదిపురుష్‌ షూటింగ్‌లను పూర్తి చేసుకోగా.. ఇటీవల నాగ్‌ అశ్విన్‌ ప్రాజెక్ట్‌ కే షూటింగ్‌ను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement