
Radhe Shyam Grand Pre Release Event At Ramoji Film City: ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంత చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ప్రీరిలీజ్ ఈవెంట్ త్వరలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్న ఈ సినిమా ఈవెంట్‌ను కూడా అదే స్థాయిలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే డిసెంబర్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఎయిర్‌పోర్టు దాడి: విజయ్ సేతుపతికి కోర్టు సమన్లు
ఇక భారీ ఎత్తున అభిమానులు, ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని రామోజీ ఫిలిమ్ సిటీలో నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే ప్రీరిలీజ్ ఈవెంట్‌లోనే మూవీ ట్రైలర్‌ను కూడా విడుదల చేసే యోచనలో చిత్ర బృందం ఉందని టాక్. టీ-సిరీస్ ఫిల్మ్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్‌లు, పోస్టర్స్‌లో కేవలం ప్రభాస్, పూజా పాత్రలను మాత్రమే చూపించారు. ఇందులో సినిమా కథపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. మరి ట్రైలర్‌తోనైనా సినిమా కథపై ఏమైనా స్పష్టత వస్తుందో చూడాలి.
చదవండి: నుదుటిన సింధూరం.. తాళి బొట్టుతో చూడ ముచ్చటగా కత్రినా, ఫొటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment