రాధేశ్యామ్‌ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌.. బీజీఎంకు తమన్‌ | Radhe Shyam Movie Background Music Director Thaman | Sakshi
Sakshi News home page

Radhe Shyam Movie: రాధేశ్యామ్‌ చిత్రానికి తమన్‌ బీజీఎం.. అందుకోసమేనా ?

Published Sun, Dec 26 2021 6:18 PM | Last Updated on Sun, Dec 26 2021 6:19 PM

Radhe Shyam Movie Background Music Director Thaman - Sakshi

Radhe Shyam Movie Background Music Director Thaman: పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అభిమానుల మోస్ట్‌ అవేయిటెడ్‌ మూవీ 'రాధేశ్యామ్‌'. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. కేకే రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్‌ జోతిష్య నిపుణిడిగా కనిపించనున్నాడు. ప్రేరణగా పూజా హెగ్డే తన గ్లామర్‌తో ఆకట్టుకోనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. ఇటీవలే హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదలవుతోంది. కాగా, ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. చిత్రబృందం చేస్తున్న సినిమా ప్రమోషన్స్‌ కూడా భారీ హైప్‌కు ఒక కారణం. ఇదివరకు రిలీజ్‌ చేసిన టీజర్‌, పాటలు పలు రికార్డులు నమోదు చేశాయి. ఇటీవలే పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటిస్తున‍్నట్లు వెల్లడించిన పోస్టర్‌కు విశేష స్పందన లభించింది. 

తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కోసం సెన్సెషనల్ మ్యూజిక్‌ డైరెక్టర్ తమన్‌తో ఒప్పందం చేసుకున్నారు మేకర్స్‌. రాధేశ్యామ్‌ సినిమాకు దక్షిణాది భాషలకు తమన్‌ బీజీఎం అందిస్తాడని యూవీ క్రియేషన్స్‌ తెలిపింది. ఇటీవల నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు తమన్‌ సంగీతం అందించాడు. ఈ చిత్రానికి సినిమాలోని బీజీఎం హైలెట్‌గా నిలిచింది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు అఖండ బీజీఎం గురించి ప్రత్యేకంగా చర్చించుకున్నారు. తమన్‌ బీజీఎం సూపర్‌ అంటూ ఆకాశానికెత్తారు ఆడియెన్స్‌. ఇదంతా చూస్తుంటే 'రాధేశ‍్యామ్‌' సినిమాకు కూడా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆ రేంజ్‌లో ఉండాలని మేకర్స్‌ భావించినట్లు తెలుస్తోంది. 


ఇదీ చదవండి: ఎవరికి రాసి పెట్టుందో.. 'రాధేశ్యామ్‌' గురించి పలు ఆసక్తికర విషయాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement