Background Music
-
'సౌండ్ ఆఫ్ సలార్'..
-
సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ శబ్దాలు.. ఇండియా మొత్తంలో ఆయన ఒక్కరేనా?
సినిమా అంటే సాధారణంగా అందరి దృష్టి హీరో, హీరోయిన్లపైనే ఉంటుంది. ఆ తర్వాత స్థానం డైరెక్టర్, మ్యూజిక్ ఎవరనేది తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. కానీ మీకెవరికీ కనిపించకుండా బ్యాక్ గ్రౌండ్లో కష్టపడేవారి గురించి మీకు తెలుసా? కనీసం వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి అరుదైన వారి గురించిప్రత్యేక కథనం. మీరెప్పుడైనా సౌండ్ లేకుండా సినిమా చూశారా? బాహుబలి లాంటి సినిమాలో గుర్రపు స్వారీ శబ్దాలు లేకుండా చూడగలరా? మరీ దీనికంతటికీ కారణం ఎవరు? అసలు ఆ శబ్దాలు సృష్టించేది ఎవరో మీకు తెలుసా? ఈ పనిని ఎలా నిర్వర్తిస్తారో తెలుసా? దీని వెనుక చరిత్ర ఏంటీ? అసలు ఈ పనిని ఎవరు చేస్తారు? వారు ఎలా చేస్తారో తెలుసుకుందాం. సినిమాలోని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్లో వచ్చే శబ్దాలు చేసే వారిని ఫోలీ ఆర్టిస్ట్ అంటారు. వీరు సినిమాలోని సందర్భాన్ని బట్టి శబ్దాలు సృష్టించడం వీరి పని. ఎంత పెద్ద సినిమా అయినా వీరు చేసే శబ్దాలు లేకుండా చూడడం చాలా అరుదు. ఈ ఫోలియో ఆర్ట్ అంటే మన రోజు వారి జీవితంలో ఉపయోగించే వస్తువులతో సౌండ్ ఎఫెక్ట్స్ అందించండం. ఈ పనులన్నీ ప్రీ ప్రొడక్షన్ సమయంలో చేస్తారు. కరణ్ అర్జున్ సింగ్ సినీ పరిశ్రమలోని ఫోలీ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించారు కరణ్ అర్జున్ సింగ్. ఆయన చిన్న వయసులోనే ఫేమస్ అయ్యారు. ఆయన పలు రకాల భాషా చిత్రాలకు ఫోలీ పేరుతో సౌండ్ ఆర్ట్‌ను రూపొందిస్తున్నారు. బాహుబలి సినిమాతో సహా పలు ప్రముఖ చిత్రాలకు ఆయన బ్యాక్ గ్రౌండ్ శబ్దాలు ఇచ్చారు. సినీ పరిశ్రమలో రాణించాలనుకునే వారికి ఆయన ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. అర్జున్ సింగ్ మాట్లాడుతూ..' ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చేవారు ఎక్కడ లేరు. కేవలం ఒకరి ద్వారా ఒకరు నేర్చుకోవాల్సిందే. ఫోలీ ఆర్టిస్ట్‌కు సౌండ్ ప్రధానం. ఇప్పటివరకు దీనిపై శిక్షణ ఇచ్చే సంస్థ లేదు. మంచి ఫోలీ ఆర్టిస్ట్ కావాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది.' అని అన్నారు. కరణ్ అర్జున్ సింగ్ ఎవరు? కరణ్ అర్జున్ సింగ్ ఒక ప్రముఖ ఫోలీ ఆర్టిస్ట్. 35 సంవత్సరాలకు పైగా బాలీవుడ్ (ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ)తో సహా పలు చిత్రాలకు పని చేస్తున్నారు. ఆయన దాదాపు 3000 కంటే ఎక్కువ చిత్రాలకు పనిచేశారు. అతను ముంబైలో అత్యంత ప్రతిభావంతులైన ఫోలీ కళాకారులు, సౌండ్ ఇంజనీర్లు, సౌండ్ ఎడిటర్లు, సౌండ్ డిజైనర్లతో జస్ట్ ఫోలీ ఆర్ట్ అనే పేరుతో సౌండ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోని ప్రారంభించారు. -
ఆస్కార్ బరిలో జేమ్స్ బాండ్.. 4 విభాగాలకు నామినేట్
No Time To Die Movie In Oscar 2022 With 4 Categories: హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు సంబంధించి అత్యంత ఆదరణ పొందిన చిత్రాల్లో ముందుగా ఉండేది జేమ్స్ బాండ్ సినిమాలు. బాండ్.. జేమ్స్ బాండ్.. అనే ఈ ఒక్క డైలాగ్ చాలు బాండ్ అభిమానులను విజిల్స్ వేయించడానికి. ఈ మూవీ ఫ్రాంచైజీకి వరల్డ్ వైడ్‌గా కోట్లలో అభిమానులు ఉన్నారు. అంతలా ఈ మూవీ సిరీస్ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. అందులో బాండ్ చేసే యాక్షన్ సీన్స్, ఉపయోగించే గ్యాడ్జెట్స్ ప్రేక్షకులను, అభిమానులను అబ్బురపరుస్తాయి. అంతేకాదు ఈ ఐకానిక్ స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజీలో నటించేందుకు ప్రముఖ హాలీవుడ్ హీరోలు సైతం ఆసక్తి చూపుతారు. ఇప్పటి వరకూ ఈ సిరీస్‌లో మొత్తం 25 సినిమాలు రాగా ఏడుగురు హీరోలు బాండ్‌గా అలరించారు. అయితే రీసెంట్గా వచ్చిన జేమ్స్ బాండ్ చిత్రం 'నో టైమ్ టూ డై'లో హీరోగా చేసిన డేనియల్ క్రేగ్‌కి బాండ్‌గా చివరి సినిమా. ప్రపంచవ్యాప్తంగా 30 సెప్టెంబర్ 2021న విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే ఇటీవల 94వ ఆస్కార్ అవార్డుల విభాగాలను కుదించి 10కి నిర్ణయించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఇందులో నాలుగు విభాగాల్లో 'నో టైమ్ టు డై' చిత్రం నామినేట్ అయింది. ఆస్కార్ బరిలో నిలిచిన 10 కేటగిరీల్లో నాలుగింటికి ఒకే సినిమా ఎంపిక కావడం విశేషం. ఆ నాలుగు విభాగాలు 1. మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ 2. మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్) 3. మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్-చిత్రం టైటిల్ సాంగ్) 4. సౌండ్. అయితే ఈ నాలుగింటిలో 'నో టైమ్ టు డై' సినిమా ఎన్ని ఆస్కార్లు కొల్లగొడుతుందో చూడాలి. సినిమా ప్రత్యేకతలు: తొలిసారిగా ఈ చిత్రం కోసం ఒక అమెరికన్ డైరెక్టర్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. బీస్ట్ ఆప్ నో నేషన్తో హాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఆకర్షించిన కారీ జోజి ఈ సినిమాకు డైరెక్టర్. అలాగే ఈ సినిమా సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ కూడా బాండ్ చిత్రాలకు తొలిసారిగా పనిచేశారు. ఈయన 'ఇన్సెప్షన్', 'ది డార్క్ నైట్', 'గ్లాడియేటర్', 'లయన్ కింగ్' వంటి చిత్రాలకు నేపథ్య సంగీతం అందించారు. బాండ్ చిత్రాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం టైటిల్ సాంగ్. ఈ సాంగ్‌పై ప్రతీ బాండ్ చిత్రానికి భారీ అంచనాలుంటాయి. వాటికి ఎక్కడా తగ్కకుండా 'నో టైమ్ టు డై' ఒరిజినల్ సాంగ్ అదరగొట్టింది. ఈ పాటను 18 ఏళ్ల యువ సంగీత సంచలనం బిల్లీ ఐలిష్ పాడటం విశేషం. బాండ్ సినిమాకు టైటిల్ సాంగ్ పాడిన అతిపిన్న వయస్కురాలిగా బిల్లీ రికార్డు సృష్టించింది. అలాగే 'స్పెక్టర్' సినిమాకు సామ్ స్మిత్ పాడిన 'రైటింగ్ ఆన్ ది వాల్' సాంగ్‌కి మంచి ఆదరణ లభించింది. హాలీవుడ్ ప్రేమకథా చిత్రం 'లాలా ల్యాండ్'తో ఆస్కార్ గెలుచుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'లైనస్ సాండ్‌గ్రెన్' ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. Presenting the 94th #Oscars shortlists in 10 award categories: https://t.co/BjKbvWtXgg pic.twitter.com/YtjQzf9Ufx — The Academy (@TheAcademy) December 21, 2021 ఇదీ చదవండి: తనకు తానే పోటీ.. ఆస్కార్ బరిలో ఏకంగా 4 మార్వెల్ చిత్రాలు -
రాధేశ్యామ్ నుంచి ఆసక్తికర అప్డేట్.. బీజీఎంకు తమన్
Radhe Shyam Movie Background Music Director Thaman: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానుల మోస్ట్ అవేయిటెడ్ మూవీ 'రాధేశ్యామ్'. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ జోతిష్య నిపుణిడిగా కనిపించనున్నాడు. ప్రేరణగా పూజా హెగ్డే తన గ్లామర్‌తో ఆకట్టుకోనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. ఇటీవలే హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదలవుతోంది. కాగా, ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. చిత్రబృందం చేస్తున్న సినిమా ప్రమోషన్స్ కూడా భారీ హైప్‌కు ఒక కారణం. ఇదివరకు రిలీజ్ చేసిన టీజర్, పాటలు పలు రికార్డులు నమోదు చేశాయి. ఇటీవలే పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నట్లు వెల్లడించిన పోస్టర్‌కు విశేష స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసం సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో ఒప్పందం చేసుకున్నారు మేకర్స్. రాధేశ్యామ్ సినిమాకు దక్షిణాది భాషలకు తమన్ బీజీఎం అందిస్తాడని యూవీ క్రియేషన్స్ తెలిపింది. ఇటీవల నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రానికి సినిమాలోని బీజీఎం హైలెట్‌గా నిలిచింది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు అఖండ బీజీఎం గురించి ప్రత్యేకంగా చర్చించుకున్నారు. తమన్ బీజీఎం సూపర్ అంటూ ఆకాశానికెత్తారు ఆడియెన్స్. ఇదంతా చూస్తుంటే 'రాధేశ్యామ్' సినిమాకు కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ రేంజ్లో ఉండాలని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. We are pleased to welcome the young music maestro @MusicThaman to score the BGM of #RadheShyam for South Languages!#Prabhas @hegdepooja @director_radhaa @justin_tunes @UV_Creations @TSeries @GopiKrishnaMvs pic.twitter.com/S2T1r568IE — UV Creations (@UV_Creations) December 26, 2021 ఇదీ చదవండి: ఎవరికి రాసి పెట్టుందో.. 'రాధేశ్యామ్' గురించి పలు ఆసక్తికర విషయాలు -
చివరి చూపులకు నోచుకోలేకపోయా!
ప్రముఖ సౌండ్ ఇంజినీర్ స్వామినాథన్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదని గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. స్వామినాథన్ మరణవార్త తెలిసి క్రుంగిపోయానని, విదేశాల్లో ఉండటంవల్ల చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయానని ఎస్పీబీ ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ గురించి ఇంకా ఆయన మాట్లాడుతూ, ‘‘చెన్నయ్‌లోని వాహినీ స్టూడియోస్‌లో కృష్ణయ్యర్, కోటేశ్వర్రావుల దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్ ఆరంభించారు స్వామినాథన్. ఆ తర్వాత చీఫ్ రికార్డిస్ట్ అయ్యారు. ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ కోసం తొలిసారి నేను పాడినప్పుడు రికార్డ్ చేసింది ఆయనే. 1966 డిసెంబర్ 15న ఈ రికార్డింగ్ జరిగింది. ఆ తర్వాత నేను పాడిన ఎన్నో పాటలు రికార్డ్ చేశారు. ‘శంకరాభరణం’ చిత్రానికైతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చేశారు. 1986లో నా విన్నపం మేరకు కోదండపాణి ఆడియో ల్యాబ్‌కు చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2009లో రిటైర్ అయ్యేంత వరకు ఆ బాధ్యత నిర్వర్తించారు. నాకు తెలిసి, ఏ రికార్డిస్ట్ కూడా ఆయన చేసినన్ని సినిమాలకు పని చేసి ఉండరు. ఆ రికార్డ్ స్వామినాథన్‌కే సొంతం అవుతుంది. ఆయన కన్నుమూసిన సమయంలో నేను ఇండియాలో లేకపోవడం నాకు శాపంలా భావిస్తున్నా. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా సార్. మీరు రిటైరైనప్పుడే సంగీతం మిమ్మల్ని మిస్సయ్యింది’’ అంటూ బాలు తన మనసులోని మాటలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.