నవీన్ పొలిశెట్టి,రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోగా నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. మహా శివరాత్రి కానుకగా గురువారం (మార్చి 11)న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ముగ్గురు జాతిరత్నాలు చేసిన కామెడీకి ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో అందరిని ఆకర్షించిన నవీన్.. జాతి రత్నాలు సినిమాతో మరో సారి నవీన్ తన ప్రతిభను కనబర్చాడు.
ఇక సినిమా విడుదల అయ్యి సక్సెస్ టాక్ సంపాదించడంతో చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ ఖుషీగా ఉంది. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి చాలా సంతోషంగా ఉన్నాడు. మార్నింగ్ షోకి పాజిటివ్ రెస్పాన్స్ రాగానే ఆనందంతో నాగ్ అశ్విన్ ను గట్టిగా హత్తుకుని చాలా సేపు అలాగే ఉండి పోయాడు. ఆనందంతో కన్నీరు కూడా పెట్టుకున్నాడు. ఇక నవీన్ ఎమోషనల్ కావడంతో నాగ్ అశ్విన్ అతన్ని మరింత గట్టిగా హత్తుకొని భుజం తట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ.. స్పాంటినియస్‌గా పంచ్‌లు వేసే నవీన్.. కన్నీరు పెట్టుకోవడంతో చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. నవీన్ చాలా సెన్సిటీవ్ అని కామెంట్లు పెడుతున్నారు.
చదవండి:
‘జాతి రత్నాలు’ టీమ్‌కి భారీ షాక్, తొలి రోజే ఇలా...
‘జాతి రత్నాలు’ మూవీ రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment