Miss Shetty And Mr Polishetty Movie Release Date Postponed - Sakshi
Sakshi News home page

అనుష్క ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. క్షమాపణలు చెప్పిన నిర్మాణ సంస్థ

Published Sat, Jul 29 2023 3:42 PM | Last Updated on Sat, Jul 29 2023 4:36 PM

Miss Shetty And Mr Polishetty Release Date Postponed - Sakshi

అనుష్క శెట్టి తెరపై కనిపించి దాదాపు మూడేళ్లు అవుతుంది. నిశ్శబ్దం(2020) చిత్రం తర్వాత ఆమె మళ్లీ తెరపై కనిపించలేదు. త్వరలోనే ఆమె తెరపై కనిపించబోతున్నారని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ సినిమా విడుదల వాయిదా పడింది.

నవీన్‌ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 4న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. గతంలోనే చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ఈ డేట్‌ని అనౌన్స్‌ చేసింది. అయితే తాజాగా రిలీజ్‌ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది.

(చదవండి: ప్రభాస్‌-అనుష్క ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌)

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కాకపోవడం వల్ల ఈ చిత్రాన్ని అనుకున్న విధంగా ఆగస్ట్‌ 4న విడుదల చేయడం లేదని, కొత్త రిలీజ్‌ డేట్‌ని త్వరలోనే ప్రకటిస్తామని ఓ ప్రకటనను విడుదల చేసింది. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నందుకు అభిమానులకు క్షమాపణలు కూడా తెలియజేసింది.  

ఈ చిత్రానికి పి.మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇందులో చెఫ్‌గా అనుష్క, స్టాండప్‌ కమెడియన్‌గా నవీన్‌ పోలిశెట్టి నటించారు. చాలా గ్యాప్‌ తర్వాత అనుష్క నటిస్తున్న  చిత్రం కావడంతో ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’పై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ట్రైలర్‌తో పాటు కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటించే చాన్స్‌ ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement