
మా సినిమాని రిలీజ్ చేయడానికి మంచి తేదీ చెప్పు అంటూ జ్యోతిష్కుడు మహేశ్ దగ్గరికి వెళ్లాడు పొలిశెట్టి. ఓ 70, 80 ఏళ్ల తర్వాత రిలీజ్ చేసుకో అని మహేశ్ అంటే... ‘హే కృష్ణా’ అంటూ ఉట్టి కొట్టి కృష్ణాష్టమికి రిలీజ్ చేసుకుంటాం అంటాడు పొలిశెట్టి. మిస్ శెట్టిగా అనుష్కా శెట్టి, మిస్టర్ పొలిశెట్టిగా నవీన్ పొలిశెట్టి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’.
మహేశ్ బాబు పి. దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్లీ కృష్ణాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించే వీడియోను సోమవారం విడుదల చేశారు. నవీన్ పొలిశెట్టి, మహేశ్‌ల కామెడీతో సాగే ఈ ఫన్నీ వీడియో ద్వారా విడుదల తేదీని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment