Miss Shetty Mr Polishetty Telugu Movie Trailer Out Now | Naveen Polishetty | Anushka Shetty - Sakshi
Sakshi News home page

తల్లి కావడానికి ప్రెగ్నెంట్‌ కావాలి కానీ.. పెళ్లెందుకు?.. ఆసక్తిగా ట్రైలర్!

Published Mon, Aug 21 2023 7:09 PM | Last Updated on Mon, Aug 21 2023 7:24 PM

Miss Shetty Mr Polishetty Telugu Trailer Released Today - Sakshi

జాతిరత్నాలు సినిమాతో తిరుగులేని క్రేజ్‌ అందుకున్న హీరో నవీన్‌ పొలిశెట్టి. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఇందులో స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మోస్ట్ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేశ్ బాబు  దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై  ఈ మూవీని నిర్మిస్తున్నారు.  ఇప్పటికే టీజర్‌ రిలీజ్‌ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చారు మేకర్స్.

(ఇది చదవండి: 'అశ్లీల వీడియోలు తీసి వేధించింది'.. హీరోయిన్‌పై సంచలన కామెంట్స్! )

తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్.  ఈ చిత్రంలో నవీన్‌ పొలిశెట్టి స్టాండప్‌ కమెడియన్‌గా కనిపించనుండగా, అనుష్క చెఫ్‌గా నటించనుంది. ట్రైలర్ చూస్తే ఈ మూవీ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్ చేసి స్టాండప్‌ కమెడియన్‌ ఎంటి? అనే అనుష్క డైలాగ్‌లో ట్రైలర్ ప్రారంభమైంది. అ తర్వాత తల్లి కావడానికి ప్రెగ్నెంట్‌ కావాలి కానీ.. పెళ్లేందుకు? అన్న అనుష్క డైలాగ్‌ అభిమానుల్లో ఈ చిత్రంపై ఆసక్తి మరింత పెంచుతోంది.  కాగా.. ఈ చిత్రం  సెప్టెంబర్‌ 7న థియేటర్లలో సందడి చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement